Scb Recruitment 2021
SCB Recruitment 2021 : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో పలు పోస్టుల భర్తీ చేయనున్నారు. దీనికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అసిస్టెంట్ కంటోన్మెంట్ ప్లానర్-4, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్), శానిటరీ ఇన్ స్పెక్టర్-1, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్-5, ఫార్మసిస్ట్(అల్లోపతి)-2, నర్సులు-2, ల్యాబ్ అసిస్టెంట్-1, డ్రెస్సర్-5, వార్డ్ సర్వెంట్-2 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే వారి వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు.. సైట్…http://www.canttboardrecruit.org/
ముఖ్య విషయాలు..
* దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 21
* వయసు.. 18 – 25 ఏళ్లు
* మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ టైప్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
* డ్రెస్సర్ పోస్టుకు స్కిల్ టెస్ట్
* క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది
* ఈ పోస్టుల భర్తీ ఇంటర్వ్యూలు ఉండవు
* పరీక్ష తేదీ, సమయం, కేంద్రం వివరాలు వెబ్ సైట్ లో తెలుపుతారు
* ఆన్ లైన్ లో మాత్రమే అప్లయ్ చేసుకోవాలి(http://www.canttboardrecruit.org/)
అప్లయ్ చేసుకునే విధానం..
అఫిషియల్ వెబ్ సైట్ www.canttboardrecruit.org కి వెళ్లాలి
New User Registration పై క్లిక్ చేయాలి
Cantt Board లిస్టులో సికింద్రాబాద్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి
ఏ పోస్టుకు అప్లయ్ చేసుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయాలి
మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఓటీపీ మీద క్లిక్ చేయాలి
మీ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది
ఓటీపీ సెక్షన్ లో ఫిల్ చేయాలి, వేలిడేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి
అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి.. ఫొటో, సంతకం అప్ లోడ్ చేయాలి
అప్లికేషన్ ఫీజు పే చేయాలి
మరిన్ని వివరాల కోసం కంటోన్మెంట్ బోర్డు రిక్రూట్ మెంట్ పోర్టల్ అఫిషియల్ వెబ్ సైట్ http://www.canttboardrecruit.org కి వెళ్లాలి.