యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL)లో 136 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ ట్రైనీ, అప్రెంటీస్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జూన్ 22, 2020 చివరి తేదీ.
విభాగాల వారీ ఖాళీలు:
కెమికల్ 4, మైనింగ్ మేట్ సీ 52, బాయిలర్ కమ్ కంప్రెషర్ అటెండెంట్ ఏ 3, వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బీ 14, బ్లాస్టర్ బీ 4, అప్రెంటీస్ (మైనింగ్ మేట్) 53, అప్రెంటీస్ ల్యాబరేటరీ అసిస్టెంట్ 6.
విద్యార్హత:
పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, మెట్రిక్యులేషన్, బీఎస్సీ ఉత్తీర్ణత. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.