DJ – Duvvada Jagannadham : వంద మిలియన్ల బన్నీ ‘DJ – దువ్వాడ జగన్నాథమ్’..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.. బన్నీ, పూజా హెగ్డే జంటగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘DJ - దువ్వాడ జగన్నాథమ్’..

100 Million Views For Dj Duvvada Jagannadham Telugu Movie On You Tube
DJ – Duvvada Jagannadham: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశారు.. బన్నీ, పూజా హెగ్డే జంటగా.. హరీష్ శంకర్ దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మించిన బిగ్గెస్ట్ సూపర్ హిట్ మూవీ ‘DJ – దువ్వాడ జగన్నాథమ్’..
2017 జూన్ 23న రిలీజ్ అయిన ఈ ఫిలిం అల్లు అర్జున్, హరీష్ శంకర్‌లకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది.. ఈ సందర్భంగా ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, సాంగ్స్‌లో బన్నీ వేసిన స్టైలిష్ స్టెప్స్, హరీష్ మార్క్ కథ, కథనాలు, పంచ్ డైలాగ్స్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్, అయానంక బోస్ విజువల్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి..