Omicron : సౌతాఫ్రికా నుంచి భారత్ కు వచ్చిన వందల మంది అడ్రస్ లేరు..

భారత్ లో ఒమిక్రాన్ కేసులు లేకపోయినా..సౌతాఫ్రికానుంచి వచ్చినవారిపై దృష్టి పెట్టారు అధికారులు. ఈక్రమంలో సౌతాఫ్రికానుంచి వచ్చిన వందలమంది అడ్రస్ లేకుండాపోవటంతో ఆందోళన కలుగుతోంది.

Hundreds Of African Fliers Gone Missing In India (1)

Omicron  : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతోంది.సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. సౌతాఫ్రికానుంచి వచ్చే విమానాలను నిషేధించారు. కానీ.. భారత్ ఇంకా సౌతాఫ్రికా విమాన సర్వీసులపై నిషేధం విధించలేదు. ఈక్రమంలో సౌతాఫ్రికా నుంచి గత 15 రోజులుగా భారత్ కు దాదాపు 1000మంది వరకు వచ్చారు. సౌతాఫ్రికా నుంచి ముంబైకి గత 15 రోజుల్లో 1000 మందికిపైగా రాగా.. అందులో కేవలం 466 మందినే గుర్తించారు ముంబై అధికారులు. మిగతా వారి ఆచూకీ మాత్రం లేదు. బీహార్ కు 281 మంది వస్తే.. అందులో 100 మంది అడ్రస్ జాడే లేకుండాపోయింది. దీంతో భారత్ లోని పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Read more : Omicron Threat : మహారాష్ట్రలో టెన్షన్..రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా

భారత్ లో ప్రస్తుతం ఒమిక్రాన్ కేసులు నమోదు కాకపోయినా..సౌతాఫ్రికానుంచి వచ్చినవారిపై అధికారులు కన్నేసారు. వారికి పరీక్షలు చేస్తున్నారు. కానీ వీరిలో కొంతమంది అడ్రస్ లేకుండాపోయారు. దీంతో ఆందోళన మొదలైంది. 15 రోజుల్లో వందలాది మంది భారత్ కు దిగినా..దాంట్లో సగం మంది వారివారి పాస్ పోర్టుల్లో పొందుపరిచి అడ్రస్సులో లేరు. దీంతో వారి ద్వారా ఈ కొత్త వేరియంట్ దేశంలో విస్తరించే ప్రమాదముంటుందని అధికారులు భావిస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నారు. వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారో? ఎవరెవరిని కలుస్తున్నారో? వీరి కనిపించకుండాపోవటంతో అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.

ముంబైకి ఈ 15 రోజుల్లో 1000 మందికిపైగా రాగా.. అందులో కేవలం 466 మందినే గుర్తించినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అదనపు మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని తెలిపారు. మిగతా వారి ఆచూకీ లేదు. బీహార్ కు 281 మంది వస్తే.. అందులో వంద మంది జాడే లేదు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Read more : North Korea : ఆ సినిమా చూసినందుకు బాలుడికి 14 ఏళ్లు జైలుశిక్ష వేసిన ఉత్తర కొరియా ప్రభుత్వం

వచ్చినవారికి వచ్చినట్టే టెస్టులు చేసేందుకు కేరళ ఆరోగ్య శాఖ.. విమానాశ్రయాల్లో అధికారులు, సిబ్బందిని మోహరించింది. నాలుగు విమానాశ్రయాల్లో సిబ్బందిని పెట్టామని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. అటు ఇటీవల సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినా.. అది ఏ వేరియంట్ అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దానికి సంబంధించిన జన్యుక్రమ విశ్లేషణ ఇంకా కొనసాగుతోంది.