Covid 18
Delhi’s Covid Cases : దేశ రాజధానిలో కొద్ది రోజులుగా కరోనా కేసులు మళ్లీ భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 10,665 కొత్త కోవిడ్ కేసులు,8 మరణాలు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లోనే కేసులు రెట్టింపు అవడం ఆందోళన కలిగిస్తోంది.
మంగళవారం ఢిల్లీలో 5481 కోవిడ్ కేసులు నమోదుకాగా..ఇవాళ 94శాతం పెరిగి 10,665 కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ ప్రకటించింది. అయితే మే-12 తర్వాత ఢిల్లీలో అత్యధిక కోవిడ్ కేసులు ఇవేనని తెలిపింది. ఇక, జూన్-26 తర్వాత ఇవేళ అత్యధికంగా 8 కోవిడ్ మరణాలు నమోదయ్యాయని తెలిపింది. ఇక,మే-14 తర్వాతే ఇవాళ అత్యధికంగా 11.88శాతం కోవిడ్ పాజిటివిటీ రేటు నమోదైనట్లు తెలిపింది.
ఇక,తాజా కేసులతో కలిపి..ఢిల్లీలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 14,74,366కి చేరింది. తాజా మరణాలతో కలిపి..ఇప్పటివరకు ఢిల్లీలో నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య 25,121కి చేరుకుంది. ప్రస్తుతం ఢిల్లీలో 23,307 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి.
ALSO READ Delhi Weekend Curfew : ఢిల్లీలో వీకెండ్ కర్ఫ్యూ.. సమయాలివే..!