Job Applicants MP : 15 ప్యూన్ ఉద్యోగాల కోసం11,000 దరఖాస్తులు..PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులతో సహా..

15 ప్యూన్ ఉద్యోగాల కోసం ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనకు 11,000 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్నవారిలో .PHD,ఇంజనీరింగ్, లా అభ్యర్ధులు కూడా ఉన్నారు.

11000 Applicants For 15 Jobs in MP  :  15 ప్యూన్ ఉద్యోగాల కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతే..ఒక్కసారిగా 11,000 మంది చేసుకున్న దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. ప్యూన్ ఉద్యోగానికి కేవలం 10th క్లాస్ అర్హత సరిపోతుంది. కానీ నిరుద్యోగ భారతం కదా..చిన్నదో పెద్దదో ఏదోక ఉద్యోగం వస్తే చాలుకునేవారు ఎంతోమంది ఉన్నారు. దీంతో ప్యూన్ ఉద్యోగం కోసం పీహెచ్ డీ, ఇంజనీరింగ్, ఆఖరికి జడ్జి కోసం ప్రిపేర్ అయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అంటే భారత్ లో నిరుద్యోగుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే..మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్యూన్ ఉద్యోగల కోసం పక్క రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్ లోని నిరుద్యోగులు కూడా దరఖాస్తు చేసుకోవటం విశేషం.

Read more : పోటెత్తిన నిరుద్యోగులు: 25పోస్టులు.. 36వేల 557 దరఖాస్తులు 

భారత్ లో ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ ఏ స్థాయిలో ఉందో మధ్యప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ప్యూన్ ఉద్యోగ నోటిఫికేషన్ కు వచ్చిన భారీ స్పందనే తెలియజేస్తోంది. ప్యూన్లు, డ్రైవర్లు, వాచ్ మ్యాన్ లు కావాలంటూ మధ్యప్రదేశ్ సర్కారు ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటనకు 11,000 మంది అభ్యర్థులు దరఖాస్తులు వచ్చాయి. పక్క రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ నుంచి కూడా అభ్యర్థులు తరలిరావడం మరో విశేషం. నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకోవటం..ఇంటర్వ్యూలకు రావటంతో గ్వాలియర్ లోని ప్రభుత్వ కార్యాలయం ముందు తీవ్ర రద్దీ నెలకొంది.

Read more : Controversial JNU circular : బోయ్ ఫ్రెండ్స్ విషయంలో..వివాదంగా జేఎన్‌యూ సర్క్యులర్..

10th class విద్యార్హత అవసరమైన ఈ ఉద్యోగాలకు పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇంజనీర్లు, న్యాయశాస్త్ర పట్టభద్రులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. పీహెచ్ డీ అభ్యర్థులు కూడా ఉన్నారంటే నిరుద్యోగం భారత్ లో ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. ఈ ఉద్యోగాల కోసం సివిల్ జడ్జి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న జితేంద్ర మౌర్య అనే అభ్యర్థి మాట్లాడుతూ..‘‘నేను సివిల్ జడ్జి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నాను..కానీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనతో నేను డ్రైవర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాను అని నా పరిస్థితి అలా ఉంది నాకు ఏదోక ఉద్యోగం కావాలి..అది చిన్నదా పెద్దదా అని కాదు. నాకుటుంబ నన్ను చాలా కష్టపడి చదివించింది.

Read more : కొంపముంచిన బర్త్‌డే పార్టీ… 45 మందికి సోకిన కరోనా.. హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు

కానీ నేను ఇప్పటి వరకు నా కుటుంబం కోసం ఏమీ చేయలేకపోయాను. ఈ క్రమంలో డ్రైవర్ ఉద్యోగమైనా..ప్యూన్ ఉద్యోగమైనా ఏదైనా సరే నాకు చాలా చాలా అవసరం. నేను ప్రిపేర్ అయ్యే పరీక్షల కోసం కనీసం పుస్తకాలు కొనుక్కోవటానికి కూడా నా దగ్గర డడ్డులేవని..నాలాగే ఎంతోమంది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారని చెబుతు వాపోయాడు. నాకు ఏదో ఒక పని కావాలి..అందుకే ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు.

ట్రెండింగ్ వార్తలు