CoronaVirus:కొంపముంచిన బర్త్‌డే పార్టీ… 45 మందికి సోకిన కరోనా.. హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు

గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా కేసులకు ఎల్ బీ నగర్ జోన్ హాట్ స్పాట్ గా మారింది. వనస్థలీపురంలో పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన కల్గిస్తోంది.

CoronaVirus:కొంపముంచిన బర్త్‌డే పార్టీ… 45 మందికి సోకిన కరోనా.. హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు

Birthday Party Effect 45 Pe

CoronaVirus:గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. కరోనా కేసులకు ఎల్ బీ నగర్ జోన్ హాట్ స్పాట్ గా మారింది. వనస్థలీపురంలో పాజిటివ్ కేసులు పెరగడంతో ఆందోళన కల్గిస్తోంది. రెండు కుటుంబాల్లో 20 మందికి పైగా కరోనా సోకింది. ఎల్‌బీ నగర్ జోన్ ను జీహెచ్ ఎంసీ కమిషనర్ పరిశీలించారు. కంటైన్మెంట్ ను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మలక్‌పేట గంజ్‌లో పని చేసే ఓ వ్యాపారి తనకు మిత్రులకు ఇచ్చిన బర్త్‌డే దావత్ ఎల్బీ నగర్ వాసుల కొంపముంచింది. ఈ బర్త్‌డే ఎఫెక్ట్ తోనే 45 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో 15 చోట్ల కంటైన్ మెంట్ జోన్లను ఏర్పాటు చేయాల్సివచ్చింది. మలక్ పేట్ మార్కెట్ లింక్ తో వనస్థలీపురంలో టెన్షన్ నెలకొంది. నగరంలోని వనస్థలీపురంలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు వస్తున్నాయి.

ప్రధానంగా ఒకరి నుంచి 16 మందికి కరోనా సోకింది. మరొకరి ద్వారా మరో 11 మందికి కరోనా వచ్చింది. ఒకే ఇంట్లో ఎక్కువ మందికి వచ్చింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త కేసులు వస్తున్నాయి. వీటిల్లో ఎల్ బీ నగర్ లో అధికంగా వస్తున్నాయి. మొన్న నగరంలో వచ్చిన కేసుల్లో ఇక్కడే నుంచే వచ్చాయి. నిన్న నమోదైన 30 కేసుల్లో4 కేసులు వనస్థలీపురం, ఎబీ నగర్ కు సంబంధించనవి కావడం గమనార్హం.

జీహెచ్‌ఎంసీ, ఇతర విభాగాల అధికారులంతా అలర్ట్ అయయ్యారు. జీహెచ్‌ఎంసీ కమిషన్ పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఇంటించి సర్వే నిర్వహిస్తున్నారు. నోడల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కువ కేసులు ఇక్కడే నుంచి రావడంతో గ్రేటర్ హైదరాబాద్ లో ఈ ప్రాంతం హాట్ టాపిక్ మారింది.