boy suicide attempt: చదువుకోమన్నందుకు బాలుడు ఆత్మహత్యా యత్నం

స్మార్ట్‌ఫోన్ పక్కనబెట్టి, చదువుకోమని తల్లిదండ్రులు చెప్పినందుకు బాలుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహారాష్ట్రలోని కండివలిలో జరిగింది.

boy suicide attempt: స్మార్ట్‌ఫోన్ పక్కనబెట్టి, చదువుకోమని తల్లిదండ్రులు చెప్పినందుకు బాలుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహారాష్ట్రలోని కండివలిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఏడో తరగతి చదువుతున్న బాలుడు కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్‌కు బాగా అడిక్ట్ అయ్యాడు. ఎప్పుడూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఈ క్రమంలో గత శుక్రవారం రాత్రి కూడా బాలుడు స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాడు. అయితే, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి, కొద్దిసేపు బయట ఆడుకొమ్మని బాలుడి తల్లిదండ్రులు చెప్పారు. పేరెంట్స్ ముందు స్విచ్ఛాఫ్ చేసిన బాలుడు, కాస్సేపటికే మళ్లీ ఫోన్ ఆన్ చేసి గేమ్స్ ఆడటం మొదలుపెట్టాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు బాలుడి దగ్గరి నుంచి సెల్‌ఫోన్ లాక్కుని, చదువుకొమ్మని హెచ్చరించారు.

Crime news: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు

దీంతో బాలుడు వేరే గదిలోకి వెళ్లి, తలుపులు మూసి, ఉరి వేసుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే గుర్తించిన తల్లిదండ్రులు తలుపులు పగులగొట్టి, బాలుడిని కిందికి దించారు. అప్పటికే బాలుడి పరిస్థితి విషమించడంతో స్థానిక ఆసుపత్రులకు తీసుకెళ్లారు. కానీ, బాలుడి కండిషన్ చాలా సీరియస్‌గా ఉండటంతో చాలా ఆసుపత్రులు అతడ్ని అడ్మిట్ చేసుకునేందుకు నిరాకరించాయి. చివరకు ఒక ఆసుపత్రిలో బాలుడ్ని అడ్మిట్ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనలో బాలుడి మెడకు సంబంధించి చాలా ఎముకలు విరిగిపోయాయని పోలీసులు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు