Crime news: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు

ఫేస్ బుక్ పరిచయం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొనగా.. గృహిణి, మరో ఇద్దరు వ్యక్తుల జైలుపాలుకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఈనెల 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. విచారణలో...

Crime news: ఫేస్‌బుక్ ఫ్రెండ్‌తో ప్రియుడిని హత్యచేయించిన గృహిణి.. పట్టించిన నిఘానేత్రాలు

Murder

Crime news: ఫేస్ బుక్ పరిచయం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొనగా.. గృహిణి, మరో ఇద్దరు వ్యక్తుల జైలుపాలుకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటన ఈనెల 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. విచారణలో తాజాగా పోలీసులు నిజాలను గుట్టురట్టు చేశారు. బాగ్అంబర్ పేటకు చెందిన యశ్మకుమార్ అనే యువకుడు వృత్తిరిత్యా ఫొటోగ్రాఫర్. మీర్ పేటకు చెందిన శ్వేతారెడ్డి అనే గృహిణితో మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పరిచయం అయింది. శ్వేతారెడ్డి భర్త సాప్ట్‌వేర్ ఉద్యోగి. వీరికి 2015లో వివాహమైంది. శ్వేతారెడ్డి బ్యూటీషియన్‌గా పనిచేస్తుంది. అయితే యశ్మకుమార్‌తో పరిచయం కొద్దికాలానికే వివాహేతర బంధంగా మారింది. వారి మధ్య మరింత చనువు పెరగడంతో నగ్నంగా వీడియోకాల్ మాట్లాడాలని శ్వేతారెడ్డిని కోరడంతో యశ్మకుమార్ కోరిక తీర్చింది.

Tina Sadhu : ప్రముఖ యువ కొరియోగ్రాఫర్ మరణం.. షాక్‌లో సినీ పరిశ్రమ..

ఈ నగ్న వీడియోలను రికార్డు చేసిన యశ్మకుమార్ తనను పెళ్లిచేసుకోవాలని, లేకుంటే నగ్న ఫొటోలు వీడియోలు అందరికీ పంపిస్తానని వేదింపులకు గురిచేశాడు. కొంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగగా.. విసిగిపోయిన శ్వేతారెడ్డి కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన మరో ఫేస్‌బుక్ ఫ్రెండ్ అశోక్‌కు విషయాన్ని చెప్పింది. దీంతో యశ్మకుమార్ అడ్డు తొలగించాలని వారు ప్లాన్ వేశారు. తొలుత మొబైల్ ఫోన్ తీసుకోవాలని భావించినప్పటికీ హత్యచేస్తేనే సమస్య తీరుతుందని నిర్ణయించుకున్నారు. ఈనెల 4న రాత్రి యశ్మకుమార్‌కు ఫోన్ చేసిన శ్వేతారెడ్డి ప్రశాంత్ హిల్స్‌కు రావాలని కోరింది. యశ్మకుమార్ రావడంతో అప్పటికే హత్యచేసేందుకు కాచుకొని ఉన్న అశోక్, మరో వ్యక్తి ఇద్దరు కలిసి యశ్మకుమార్‌ను వెనుక నుంచి తలపై సుత్తితో కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. యశ్మకుమార్ హాస్పటల్లో చికిత్సపొందుతూ ఘటన జరిగిన రెండు రోజులకే కన్నుమూశారు.

Telangana : ఆస్పత్రిలోనే అనుమానాస్పదంగా మృతి చెందిన డాక్టర్ శ్వేత

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా హత్యకు కారకులెవరో గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. శ్వేతారెడ్డి దీనికంతటికి కారణమని తేలింది. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని రిమాండ్‍కు తరలించారు. ఫేస్‌బుక్ పరిచయం కాస్త వ్యక్తి మరణానికి కారణంగాకాగా, ఓ గృహిణి, ఇద్దరు వ్యక్తులను జైలుపాలు చేసింది.