Commerce in 5th class : 5వ తరగతిలో కామర్సా? ఇదిగో ప్రూఫ్

80 ఏళ్ల క్రితం భారతదేశంలో 5వ తరగతి పిల్లలు వ్యాపారం-వాణిజ్యం గురించి చదువుకున్నారా? అంటే అప్పట్లోనే వారికి కామర్స్ సబ్జెక్ట్ మీద అంత గ్రిప్ ఉందా? రిటైర్డ్ ఐఏఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ ట్వీట్ చేసిన 1943 నాటి 5వ తరగతి ప్రశ్నాపత్రం చూస్తే అర్ధం అవుతుంది.

Commerce in 5th class

Commerce in 5th class :  1943లో 5వ తరగతిలోనే కామర్స్ సబ్జెక్టా? అంటే 80 సంవత్సరాల క్రితం పిల్లలు 5వ తరగతిలో ఉండగానే వ్యాపారం, వాణిజ్య పాఠాలు నేర్చుకున్నారా? నిజమే. రిటైర్డ్ ఐఎఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ ట్వీట్ చూడండి.

New Delhi : పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆయన తిట్టేస్తారంతే ! .. సిన్సియారిటీకి మారుపేరు ఐఏఎస్ దీపక్ రావత్

1943వ సంవత్సరానికి చెందిన 5వ తరగతి క్వశ్చన్ పేపర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రిటైర్డ్ ఐఎఎస్ భద్రీలాల్ స్వర్ణాకర్ దీనిని స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. 1943-44 కి సంబంధించిన అర్ధవార్షిక పరీక్షలకు సంబంధించిన పేపర్ అది. ఈ ప్రశ్నాపత్రంలో గరిష్ట మార్కుల 100, పాస్ కావాల్సిన మార్కులు 33. ఇక 2.30 గంటల వ్యవధిలో పరీక్ష పూర్తి చేయాలి.

 

బంగారం ధర నిర్ణయించడం ఎలా, వ్యాపారం గురించి లేఖ రాయమని ఇలా ప్రశ్నాపత్రంలో విద్యార్ధులను కోరారు. భద్రీలాల్ స్వర్ణాకర్ ‘భారతదేశంలో 1943-44 అర్ధ వార్షిక పరీక్ష ప్రమాణం చూడండి. మెట్రిక్ సిస్టమ్ ను వ్యవస్థ ఎంతలా సులభతరం చేసింది’ అనే శీర్షికతో షేర్ చేశారు. ఇప్పుడు ఈ ప్రశ్నాపత్రం తెగ వైరల్ అవుతోంది.

Ashok Khemka: ఆయన నిజాయితీగల ఐఏఎస్ అధికారి.. కానీ రోజుకు 8 నిమిషాలే పని, రూ.40 లక్షల జీతం
అప్పటి ప్రశ్నాపత్రం చూస్తే 10 ఏళ్ల పిల్లల వయసుకి చాలా కష్టమైన పరీక్షే. ఈ సబ్జెక్ట్ ఇంత క్లిష్టంగా ఉంటే మిగిలిన సబ్జెక్ట్స్ ఇంకెలా ఉండేవో? కానీ అప్పటి వారికి ఇది గట్టి పునాదిగా చెప్పాలి. ఇప్పుటి జనరేషన్ పిల్లలకి ఇదే పేపర్ రాయమని ఇస్తే ఎన్ని ప్రశ్నలకు సమాధానం రాయగలుగుతారు?