New Delhi : పనిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారో ఆయన తిట్టేస్తారంతే ! .. సిన్సియారిటీకి మారుపేరు ఐఏఎస్ దీపక్ రావత్
పనిపట్ల శ్రద్ధ లేని ఉద్యోగుల్ని ఆయన సహించరు. జాగ్రత్తలు సూచిస్తారు. మాట వినకపోతే హెచ్చరిస్తారు. ఉద్యోగులకు కూడా ఆయనంటే హడల్. తాజాగా జరిపిన తనిఖీల్లో ఐఏఎస్ దీపక్ రావత్ ఉద్యోగుల్ని తిట్టిన వీడియో వైరల్ అవుతోంది.

New Delhi
New Delhi : తనిఖీలకు వచ్చినప్పుడు ఏ ఉద్యోగి అయినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆయన ఊరుకోడు. వెంటనే తిట్టేస్తాడు. సిన్సియారిటీకి మారుపేరైన ఐఏఎస్ ఆఫీసర్ దీపక్ రావత్ తాజాగా కొందరు ఉద్యోగులకు క్లాస్ తీసుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
ఐఏఎస్ దీపక్ రావత్ వ్యక్తిగతంగా, వృత్తి పరంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. తన స్వంత యూట్యూబ్ ఛానెల్ లో 4.6 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్లను కలిగి ఉండి పేరు సంపాదించారు. రీసెంట్‌గా ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన ఆయన తనిఖీలు నిర్వహిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఆ సమయంలో పని పట్ల అజాగ్రత్తగా వ్యవహరించిన ఉద్యోగులను ఆయన తిట్టిన వీడియో ఇంటర్నెట్‌లో కనిపిస్తోంది. పదే పదే తప్పులు చేయవద్దని.. అలా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రావత్ ఈ వీడియోలో ఉద్యోగులకు సూచిస్తున్నారు. ఈ వీడియోపై సానుకూలంగా స్పందనలు వ్యక్తం అవుతున్నాయి.
Ashok Khemka: ఆయన నిజాయితీగల ఐఏఎస్ అధికారి.. కానీ రోజుకు 8 నిమిషాలే పని, రూ.40 లక్షల జీతం
దీపక్ రావత్ లాంటి ఆఫీసర్ చాలా స్ఫూర్తిదాయకమని.. ఆయన సిన్సియర్ గా పనిచేస్తున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయనలాగనే ప్రతి ప్రభుత్వ అధికారి నిజాయితీగా పనిచేస్తే దేశం బాగుపడుతుందని చాలామంది కామెంట్లు పెట్టారు.