Refillable India : ‘రీఫిల్లబుల్ ఇండియా’ సర్వీస్‌ను మెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియ సాహు.. ఇంతకీ ఈ సర్వీస్ డీటెయిల్స్ ఏంటంటే?

ప్లాస్టిక్ వాడకండి .. ప్రమాదకరం.. ముఖ్యంగా మూగజీవాలకు ఎంతో హాని కలిగిస్తుందని ఎంత మొత్తుకున్నా ఎవరి చెవినా పడట్లేదు. తాజాగా రీఫిల్లబుల్ ఇండియా పరిచయం చేస్తున్న సరికొత్త సర్వీస్ ద్వారా అయినా ఈ కాలుష్యాన్ని కొంతవరకూ కంట్రోల్ చేయవచ్చు అనిపిస్తోంది.. ఇంతకీ వీరు అందిస్తున్న సర్వీస్ ఏంటి?

Refillable India : ‘రీఫిల్లబుల్ ఇండియా’ సర్వీస్‌ను మెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియ సాహు.. ఇంతకీ ఈ సర్వీస్ డీటెయిల్స్ ఏంటంటే?

Refillable India

Refillable India :  ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్ధాలు తెలిసి కూడా ప్రజలు వాటిని వినియోగిస్తూనే ఉన్నారు. ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయాలు ఎన్ని వస్తున్నా జనం వాటిపై మొగ్గు చూపట్లేదు. పాత కంటైనర్లలో హోమ్ కేర్ ఐటమ్ లు రీఫిల్ చేసుకునేందుకు ఓ కొత్త సర్వీస్‌ను పరిచయం చేస్తోంది రీఫిల్లబుల్ ఇండియా (Refillable India).  ఐఏఎస్ అధికారి (IAS officer) సుప్రియా సాహూ (Supriya Sahu IAS) ఈ సర్వీస్ అందిస్తున్న సేవలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

NASA Satellite: యుక్రెయిన్ ప్రజలను వణికించిన ప్లాష్‌ లైట్.. వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన నాసా

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ప్లాస్టిక్ భూతం (Plastic pollution) ఒకటి. దీనిని కొంతవరకైనా కంట్రోల్ చేసేందుకు చెన్నైలో రీఫిల్లింగ్ ఇండియా సంస్థ సరికొత్త సర్వీస్ పరిచయం చేస్తోంది.  ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు ఈ సేవలను ప్రారంభించారు. ఇక ఈ సంస్థ ముఖ్యంగా కస్టమర్లకు టాయిలెట్ క్లీనర్లు (toilet cleaner), డిష్ వాషింగ్ లిక్విడ్ లు, లాండ్రీ లిక్విడ్ లు వంటి హోమ్ కేర్ ప్రాడక్ట్స్‌ను పాత కంటైనర్లలో తిరిగి ఫిల్లింగ్ చేసి ఇచ్చే అవకాశం కల్పిస్తోంది. దీని ద్వారా కూడా చాలావరకూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించినట్లవుతుంది. ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఈ సర్వీస్ కి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. డిస్పెన్సర్‌తో అమర్చిన పికప్ ట్రాక్‌లో పాత గాజు బాటిళ్లలోకి హోమ్ కేర్ ప్రాడక్ట్స్ ఎలా ఫిల్ చేస్తారో ఈ వీడియోలో పూర్తిగా వివరించారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

living bridge : 400 మీటర్ల పొడవైన బ్రిడ్జ్‌పై అందమైన నగరం.. అది ఎక్కడో కాదు..

ఈ వీడియో చూసిన యూజర్లు త్వరలో ఈ మెషీన్ మెట్రోపాలిటన్ సిటీల్లో ఇన్ స్టాల్ చేస్తే బాగుంటుందని.. ఈ సర్వీస్ అందిస్తున్న వారి ఆలోచన అద్భుతమని .. ఇది ఎంతో మేలు చేస్తుందని వ్యాఖ్యానించారు. అతి త్వరలో ఈ మెషీన్స్ అన్ని నగరాల్లోకి ప్రవేశిస్తే నిజంగానే చాలావరకూ ప్లాస్టిక్ కాలుష్యం అరికట్టినట్లవుతుంది.