living bridge : 400 మీటర్ల పొడవైన బ్రిడ్జ్‌పై అందమైన నగరం.. అది ఎక్కడో కాదు..

బ్రిడ్జ్‌పై అందమైన భవనాలు.. 400 మీటర్ల పొడవునా కళ్లను కట్టిపడేస్తాయి. పై నుంచి చూస్తే అద్భుతం అనిపించే ఆ ప్రాంతం ఎక్కడో తెలుసుకోవాలని ఉందా?

living bridge : 400 మీటర్ల పొడవైన బ్రిడ్జ్‌పై అందమైన నగరం.. అది ఎక్కడో కాదు..

living bridge

living bridge :  సాధారణంగా బ్రిడ్జ్‌పై (bridge) నిలబడి కింద కనపడే ఇళ్లను, ప్రకృతిని చూసి ఔరా అనుకుంటాం. అలాంటిది బ్రిడ్జి పైనే ఓ అందమైన నగరం ఉంటే ఎలా ఉంటుంది.. ఒకసారి ఊహించండి. చైనాలోని చాంకింగ్ (Chongqing) టౌన్ షిప్ చూస్తే ఫిదా అయిపోతారు.

Delhi Police : అద్భుతంగా పాట పాడిన ఢిల్లీ పోలీస్.. సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్న వీడియో

ఇటీవల కాలంలో రకరకాల పద్ధతుల్లో, హంగులతో ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. సకల సౌకర్యాలతో ఇంటిని స్వర్గసీమలా మలుచుకుంటున్నారు. రీసెంట్ గా ఓ వ్యక్తి షిప్ మోడల్‌లో 10 ఏళ్లుగా తన ఇల్లు కడుతూనే ఉన్నాడనే వార్త కూడా వైరల్ అయ్యింది. ఇక చైనా గురించి చెప్పాలి. అక్కడ మామూలుగానే భవన నిర్మాణాలు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక చాంకింగ్ నగరానికి వెళ్తే అక్కడి భవన నిర్మాణాలు చూసి ఆగిపోతారు. అసలు ముందు వాటిని చూడాలంటే బ్రిడ్జ్ ఎక్కాల్సిందే. అదేంటి అంటారా? సాధారణంగా మనం బ్రిడ్జ్ ఎక్కితే కింద ఉన్న నిర్మాణాల్ని, ప్రకృతిని చూసి మైమరచిపోతాం. కానీ ఈ బ్రిడ్జిపైన కట్టిన నిర్మాణాల్ని చూసి నోరెళ్లబెట్టాల్సిందే.

Horse Found Alive : మహా అద్భుతం..! టర్కీలో భూకంపం వచ్చిన 21రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డ గుర్రం, వీడియో వైరల్

చాంకింగ్‌లోని లిన్షి టౌన్ షిప్‌లో 400 మీటర్ల పొడవున్న వంతెనపై అద్భుతమైన భవనాలు నిర్మించారు. బ్రిడ్జి పొడవునా రకరకాల భవన నిర్మాణాలు దర్శనం ఇస్తాయి. వ్యాపారవేత్త హర్షద్ గోయెంకా (Harsh Goenka) ఈ నగరానికి సంబంధించిన అద్భుతమైన వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.  ఓసారి అక్కడ ఉన్నట్లుగా ఊహించుకోమంటూ శీర్షికను యాడ్ చేసారు.  చైనా సాంప్రదాయ పద్ధతులతో (Chinese) పాటు పాశ్చాత్య తరహాలో (Western-style) నిర్మాణమైన ఈ టౌన్ షిప్ లో నివసించేవారికి ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని మాత్రం అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.