NASA Satellite: యుక్రెయిన్ ప్రజలను వణికించిన ప్లాష్‌ లైట్.. వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన నాసా

కీవ్ గగనతలంపై ప్రకాశవంతమైన వెలుగును కొందరు వీడియోల్లో బంధించారు. స్థానిక ప్రసార మాద్యమాల్లో ఆ వీడియో వైరల్ అయింది.

NASA Satellite: యుక్రెయిన్ ప్రజలను వణికించిన ప్లాష్‌ లైట్.. వీడియో వైరల్.. క్లారిటీ ఇచ్చిన నాసా

NASA Satellite

NASA Satellite: యుక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఏడాదికాలంకుపైగా రష్యా సైన్యం దాడులతో యుక్రెయిన్ ప్రజలు భయంతో వణికిపోతూనే ఉన్నారు. ఎప్పుడు ఏ ప్రాంతంలో రష్యా క్షిపణులు పడుతాయో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని యుక్రెన్ ప్రజలు జీవనం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో యుక్రెయిన్ రాజధాని కీవ్ గగనతలంలో ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. వేగంగా అది భూమిపైకి వస్తున్నట్లు ఉండటంతో రష్యా వైమానిక దాడి అయి ఉండొచ్చని స్థానిక ప్రజలు భయంతో వణికిపోయారు.

Russia-Ukraine War: ఆ బిల్లుపై పుతిన్ సంతకం.. యుక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా సైన్యం.. ఎనిమిది మంది మృతి

కీవ్ గగనతలంపై బుధవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది. ఈ వెలుగుతో అప్రమత్తమైన అధికారులు వైమానిక దాడులు జరుగుతోందేమోనని హెచ్చరికలు జారీ చేశారు. అయితే, కొద్దిసేపటి తరువాత అది వైమానిక దాడివల్ల వచ్చిన వెలుగు కాదని, నాసా ఉపగ్రహం వల్ల వచ్చిన వెలుగు అని తేలింది. నాసా వారం రోజుల క్రితం ఈ విషయాన్ని చెప్పింది. ఓ ఉపగ్రహం బుధవారం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని, ఇది వాతావరణంలోకి ప్రవేశించగానే కాలిపోతుందని పేర్కొంది. ఆ సమయంలో వెలుగు వస్తుందని, కానీ భూమిపై ఎవరికి ప్రమాదం ఉండదని తెలిపింది.

 

 

కీవ్ గగనతలంపై ప్రకాశవంతమైన వెలుగును కొందరు వీడియోల్లో బంధించారు. స్థానిక ప్రసార మాద్యమాల్లో ఆ వీడియో వైరల్ అయింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడంతో మీమ్స్ హోరెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఎయిర్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. మీమ్స్ లో మైమానిక దళం గుర్తులను వినియోగించకూడదని హెచ్చరికలు జారీ చేసింది.