Russia-Ukraine War: ఆ బిల్లుపై పుతిన్ సంతకం.. యుక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా సైన్యం.. ఎనిమిది మంది మృతి

రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య ఏడాది కాలంగా యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్‌లోని ప్రధాన పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రష్యా క్షిపణి దాడులు చేస్తుంది.

Russia-Ukraine War: ఆ బిల్లుపై పుతిన్ సంతకం.. యుక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా సైన్యం.. ఎనిమిది మంది మృతి

Russia-Ukraine War

Russia-Ukraine War: రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం (Russia-Ukraine War)  కొనసాగుతూనే ఉంది. రష్యా దళాలు యుక్రెయిన్ (Ukraine) లోని పలు ప్రాంతాలపై దాడులు కొనసాగిస్తున్నాయి. క్షిపణి దాడుల (Missile attacks) తో విరుచుకుపడుతున్నాయి. తాజాగా యుక్రెయిన్ లోని స్లోవియన్స్క్ (Sloviansk)  లోని బ్లాక్ పై రష్యా బాంబు దాడి చేసినట్లు, ఈ బాంబు దాడిలో రెండేళ్ల చిన్నారితో సహా ఎనిమిది మరణించగా, 21 మంది గాయపడినట్లు యుక్రెయిన్ టెలివిజన్ (Ukraine Television) లో డొనెట్స్క్ ప్రాంత గవర్నర్ పావ్లో కిరిలెంకో  (Governor Pavlo Kirilenko) తెలిపారు.

Russia-Ukraine War:3 వారాల గ్యాప్ తర్వాత ఉక్రెయిన్ మీద మరోసారి విరుచుకుపడ్డ రష్యా

ఇరు దేశాల మధ్య ఏడాది కాలంగా యుద్ధం కొనసాగుతోంది. యుక్రెయిన్ లోని ప్రధాన పట్టణాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ రష్యా వరుస దాడులు నిర్వహిస్తోంది. ఇరు దేశాలకు చెందిన లక్షలాది మంది సైనికులు మరణించారు. తాజాగా స్లోవియన్క్స్ యుక్రెయిన్ నియంత్రణలో ఉన్న దొనేత్సక్‌లోని ఒక భాగంలో ఉంది. ఇక్కడ రష్యా క్షిపణి దాడి చేసింది. ఈ దాడి తరువాత శిథిలాల నుండి రక్షించబడిన ఓ యువకుడ్ని అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించేలోపు మరణించాడని స్థానిక పోలీసులు తెలిపారు.

Russia-Ukraine War: యుక్రెయిన్ అధ్యక్షుడిపై దాడి విషయంలో రష్యా వైఖరి ఇదే.. సంచలన విషయం వెల్లడించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని

ఇదిలాఉంటే మిలిటరీలో పౌరులను చేర్చుకోవడాన్ని సులభతరం చేసే బిల్లుపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం సంతకం చేసిన విషయం విధితమే. పుతిన్ సంతకం చేసిన చట్టం ప్రకారం.. డ్రాప్టీ అంతర్జాతీయంగా ప్రయాణించకుండా నిషేధించబడతారు. ఎలక్ట్రానిక్ కాల్ – అప్ పేపర్ లను స్వీకరించిన తర్వాత నమోదు చేసే కార్యాలయానికి నివేదించాలి. ఈ బిల్లుపై పుతిన్ సంతకం పెట్టడానికి ప్రధాన కారణం ఉంది. గత సంవత్సరం యుక్రెయిన్ పై యుద్ధం చేసేందుకు పుతిన్ సైనికుల సమీకరణ ప్రకటించారు. ఆ తరువాత 10వేల మందికిపైగా యువకులు రష్యాను విడిపెట్టారు.

Russia-Ukraine War: రష్యా నుంచి 69 క్షిపణులు దూసుకువచ్చాయి.. 54 క్షిపణులను తిప్పికొట్టాం: ఉక్రెయిన్

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బిల్లుపై సంతకం చేసిన తరువాత కొద్ది గంటలకే స్లోవియన్స్క్ పై దాడి జరిగింది. స్లోవియన్స్క్, దాని చుట్టుపక్కల ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు పుతిన్ సైన్యం ఈ దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఇదిలాఉంటే, రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం గతేడాది ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. నేటికి కొనసాగుతూనే ఉంది. లక్షలాది మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు.