Russia-Ukraine War:3 వారాల గ్యాప్ తర్వాత ఉక్రెయిన్ మీద మరోసారి విరుచుకుపడ్డ రష్యా
యూరప్ ఖండంలో అతిపెద్ద పవర్ ప్లాంటులో పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి సుమారు ఆరు సార్లు ఇది అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంది. ప్రస్తుతం డీజిల్ జనరేటర్లతో పనులు కొనసాగుతున్నాయని, అయితే ఆ డీజిల్ సైతం కేవలం 10 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది.

Russia-Ukraine war
Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య వాతావరణం కాస్త చల్లబడుతుందనుకున్న ప్రతీసారి మిసైల్లు వినాశనం సృష్టిస్తున్నాయి. తాజాగా మూడు వారాల పాటు కాస్తంత నెమ్మదించిన వాతావరణమే కనిపించినప్పటికీ.. తాజాగా మరోసారి క్షిపణుల దాడులతో అగ్గి రాజేసింది రష్యా. ఉక్రెయిన్‌లోని రాజధాని కైవ్, ఖార్కివ్, నల్ల సముద్రం ఓడరేవు ఒడెసాతో సహా పలు నగరాలపై గురువారం రష్యా దాడి చేశాయని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. భవనాలు, ఇంధన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులు చేసినట్లు పేర్కొంది.
Encounter In Chhattisgarh : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులకు తీవ్ర గాయాలు
ఉక్రెయిన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు వారాల్లో ఇది మొదటి క్షిపణి దాడి. ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌పై రాత్రిపూట కనీసం 15 సార్లు రష్యా దాడి చేసిందని ఖార్కివ్ గవర్నర్ తెలిపారు. ఈ దాడుల్లో పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా, 11 మంది పౌరులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం వెల్లడించింది.
Mumbai: బాత్‌రూమ్‌లో దంపతుల అనుమానాస్పద మృతి.. గీజరే కారణమా?
ఇక యూరప్ ఖండంలో అతిపెద్ద పవర్ ప్లాంటులో పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి సుమారు ఆరు సార్లు ఇది అత్యంత కఠిన పరిస్థితిని ఎదుర్కొంది. ప్రస్తుతం డీజిల్ జనరేటర్లతో పనులు కొనసాగుతున్నాయని, అయితే ఆ డీజిల్ సైతం కేవలం 10 రోజులకు సరిపడా మాత్రమే ఉన్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది.