Russia-Ukraine War: యుక్రెయిన్ అధ్యక్షుడిపై దాడి విషయంలో రష్యా వైఖరి ఇదే.. సంచలన విషయం వెల్లడించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని

యుక్రెయిన్‌కు చెందిన సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారు. యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై రష్యా దాడి చేస్తోంది. అయితే, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దాడి జరగలేదు. దీనికో కారణం ఉంది.

Russia-Ukraine War: యుక్రెయిన్ అధ్యక్షుడిపై దాడి విషయంలో రష్యా వైఖరి ఇదే.. సంచలన విషయం వెల్లడించిన ఇజ్రాయెల్ మాజీ ప్రధాని

Russia-Ukraine War: యుక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడాది కాలంగా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. రష్యా దాడి చేస్తోంటే.. యుక్రెయిన్ ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తోంది. ఈ యుద్ధంలో ఇరు దేశాలకు చెందిన సైనికులు మరణిస్తున్నారు.

Pervez Musharraf: హెయిర్ స్టైల్ గురించి ధోనికి సలహా ఇచ్చిన ముషారఫ్.. ఇంతకీ అదేంటంటే.. వైరల్ అవుతున్న వీడియో

యుక్రెయిన్‌కు చెందిన సాధారణ పౌరులు భారీ సంఖ్యలో మరణిస్తున్నారు. యుక్రెయిన్‌లోని అనేక ప్రాంతాలపై రష్యా దాడి చేస్తోంది. అయితే, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి దాడి జరగలేదు. దీనికో కారణం ఉంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలి బెన్నెట్ వెల్లడించారు. ఆయన రష్యా-యుక్రెయిన్ యుద్ధంపై తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఆయన ఈ యుద్ధం ప్రారంభమైన సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించాడు. కానీ, ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ సందర్భంలో బెన్నెట్.. పుతిన్‌ను యుక్రెయిన్ అధ్యక్షుడిని చంపడం గురించి ప్రశ్నించారు.

Andaman and Nicobar Islands: మహిళపై సామూహిక అత్యాచారం.. అండమాన్ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీటు దాఖలు

‘‘మీరు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని చంపాలనుకుంటున్నారా?’’ అని పుతిన్‌ను బెన్నెట్ ప్రశ్నించారు. దీనికి సమాధానంగా పుతిన్ మాట్లాడుతూ ‘‘నేను జెలెన్‌స్కీని చంపాలనుకోవడం లేదు’’ అని చెప్పాడు. అయితే, మరోసారి బెన్నెట్ దీని గురించి ప్రశ్నించాడు. అప్పుడు పుతిన్ ఈ విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చాడు. జెలెన్‌స్కీని కచ్చితంగా చంపబోనని చెప్పాడు. ఈ విషయాన్ని తాను జెలెన్‌స్కీకి కూడా చెప్పినట్లు బెన్నెట్ చెప్పాడు. అయితే, జెలెన్‌స్కీ ఇది నమ్మలేదని, కచ్చితంగా తనను పుతిన్ చంపాలనుకోవడం లేదా అని అడిగాడని బెన్నెట్ వెల్లడించాడు.

పుతిన్ కచ్చితంగా జెలెన్‌స్కీని చంపాలనుకోవడం లేదని అతడికి వివరించినట్లు చెప్పాడు. దీంతో ప్రస్తుత అంచనా ప్రకారం.. రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఎంతకాలం జరిగినప్పటికీ, జెలెన్‌స్కీ ప్రాణాలకు ముప్పులేదని అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు.