Encounter: కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు తీవ్రవాదులు మృతి
భారత భద్రతా దళాలకు ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో జమ్ము కాశ్మర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.
- Narender Thiru
- Published On : July 11, 2022 / 03:17 PM IST
Encounter
Encounter: జమ్ము-కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. పుల్వామా జిల్లా, అవంతిపుర పరిధిలోని వాందకపోరా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. భారత భద్రతా దళాలకు ఈ ప్రాంతంలో తీవ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో జమ్ము కాశ్మర్ పోలీస్, ఇండియన్ ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ కలిసి సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దశలో తీవ్రవాదులు తలదాచుకున్న ప్రదేశానికి భద్రతా దళాలు చేరుకున్నాయి. ఇది గుర్తించిన తీవ్రవాదులు, భద్రతా దళాలపై కాల్పులు జరపడం ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపారు.
Couple Dance: ఆకట్టుకుంటున్న కపుల్ డ్యాన్స్.. వీడియో వైరల్
చాలాసేపు జరిగిన హోరాహోరి పోరులో ఇద్దరు తీవ్రవాదులు మరణించారు. వీరిలో ఒకరిని కైసర్ కోకాగా గుర్తించారు. మరో తీవ్రవాదిని గుర్తించాల్సి ఉందన్నారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒక అమెరికన్ రైఫిల్ (ఎమ్-4 కార్బైన్), ఒక పిస్టల్, మరికొన్ని పేలుడు పదార్థాల్ని స్వాధీనం చేసుకున్నారు. తీవ్రవాదుల మృతదేహాల్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
