Couple Dance: ఆకట్టుకుంటున్న కపుల్ డ్యాన్స్.. వీడియో వైరల్

ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన దీపాన్షు కాబ్రా అనే ఒక ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. అందులో కొత్తగా పెళ్లైన ఒక జంట స్టేజ్‌పై ఆకట్టుకునే స్టెప్పులతో డాన్స్ చేసింది. 1994లో వచ్చిన ఖుద్దార్ అనే సినిమాలోని తుమ్సా కోయీ ప్యారా అనే పాటకు ఈ జంట డాన్స్ చేసింది.

Couple Dance: ఆకట్టుకుంటున్న కపుల్ డ్యాన్స్.. వీడియో వైరల్

Couple Dance

Couple Dance: పెళ్లి సందర్భంగా కొత్త జంట అప్పుడప్పుడూ డ్యాన్స్ చేయడం మామూలే. అందులో కొన్ని జంటలు చేసే డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఆ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతాయి. తాజాగా ఒక జంట చేసిన డ్యాన్స్ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన దీపాన్షు కాబ్రా అనే ఒక ఐపీఎస్ అధికారి తన ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశాడు. అందులో కొత్తగా పెళ్లైన ఒక జంట స్టేజ్‌పై ఆకట్టుకునే స్టెప్పులతో డాన్స్ చేసింది. 1994లో వచ్చిన ఖుద్దార్ అనే హిందీ సినిమాలోని తుమ్సా కోయీ ప్యారా అనే పాటకు ఈ జంట డాన్స్ చేసింది.

Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్ర నేడు మళ్లీ ప్రారంభం

ఒరిజినల్‌గా ఈ పాటలో గోవిందా, కరిష్మా కపూర్ నటించారు. అయితే, తాజాగా ఈ నవ జంట చేసిన మూవ్స్ అద్భుతంగా ఉన్నాయంటున్నారు నెటిజన్స్. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగుందని, కపుల్.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోలో డ్యాన్స్ చేసిన జంట వివరాలు మాత్రం తెలియవు. అలాగే వీడియో ఎప్పుడు తీశారో కూడా స్పష్టత లేదు. కానీ, ఇప్పటివరకు ఈ వీడియోకు ఆరు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయంటే ఎంతమందికి నచ్చుంటుందో అర్థం చేసుకోవచ్చు. కావాలంటే మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.