Clash In Pub: పబ్బులో యువకుడిపై అమ్మాయిల దాడి.. వీడియో వైరల్
పబ్బులో ఒక యువకుడిపై ఇద్దరు అమ్మాయిలు దాడి చేశారు. ఈ ఘటన ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లోని లక్నోలో జరిగింది. స్థానిక ‘అన్‌ప్లగ్‌డ్’ అనే పబ్బులో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
- Narender Thiru
- Published On : July 26, 2022 / 10:15 AM IST
Clash In Pub
Clash In Pub: ఉత్తర ప్రదేశ్, లక్నోలోని ఒక పబ్బులో ఒక అబ్బాయిపై ఇద్దరు అమ్మాయిలు దాడి చేశారు. స్థానిక విభూతిఖండ్ ఏరియాలో ఉన్న ‘అన్‌ప్లగ్‌డ్’ అనే పబ్బులో ఇటీవల ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పబ్బులో ఒక యువకుడికి, స్నేహితులైన ఇద్దరు యువతులకు మధ్య గొడవ తలెత్తింది. ఈ ఘటనలో యువకుడిపై అమ్మాయిలు దాడికి పాల్పడ్డారు. అతడు మాట్లాడ్డానికి ప్రయత్నించినప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు.
iPhones: యాపిల్ హవా.. రెట్టింపైన ఐఫోన్స్ అమ్మకాలు
అందరూ చూస్తుండగానే యువకుడిపై దాడి చేశారు. ఒక అమ్మాయి అయితే.. పక్కనున్న పూల కుండీ తీసుకుని దాడి చేసింది. చుట్టుపక్కల వాళ్లు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వాళ్లు పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బౌన్సర్లు రంగప్రవేశం చేశారు. అమ్మాయిల్ని పక్కకు లాగేశారు. బాధితుడ్ని దూరంగా తీసుకెళ్లారు. దీంతో గొడవ ముగిసింది. ఈ ఘటనపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
Fierce fight between boys and girls in the unplugged cafe of Vibhutikhand police station area of #Lucknow #Trending #Viralvideo #India pic.twitter.com/vMQrArO3eZ
— IndiaObservers (@IndiaObservers) July 23, 2022
