Agnipath: సికింద్రాబాద్‌లో పోలీసుల కాల్పులు.. ఇద్దరు మృతి
స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
- Narender Thiru
- Published On : June 17, 2022 / 12:07 PM IST
Agnipath Protest
Agnipath: కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు.
Agnipath: తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ.. సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు
శుక్రవారం ఉదయం భారీ ఎత్తున రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనమయ్యాయి. రైల్వే స్టేషన్‌కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మరణించారు. మరికొందరు యువకులకు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
Agnipath: యువతకు ఎంతో ప్రయోజనం: అగ్నిపథ్‌పై అమిత్ షా ప్రశంసలు
దాడిలో అజంతా ఎక్స్‌ప్రెస్, శాలిమార్ ఎక్స్‌ప్రెస్, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైలు దహనమయ్యాయి. మరోవైపు ఈ ఘటనపై దక్షిణ మధ్య రైల్వే శాఖ ఆరా తీస్తోంది. రైళ్ల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అత్యసవర సమావేశం నిర్వహిస్తోంది. తాజా ఘటనల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో భద్రత పెంచారు. అన్ని రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటించారు.
