Agnipath: తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ.. సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు

రైలు పట్టాల మధ్య నిప్పు పెట్టారు. పట్టాలపై సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసి రైళ్లు కదలకుండా చేశారు. రైల్వేకు చెందిన పార్శిళ్లను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Agnipath: తెలంగాణను తాకిన అగ్నిపథ్ సెగ.. సికింద్రాబాద్‌లో రైళ్లకు నిప్పు

Agnipath

Agnipath: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేక ఆందోళన తెలంగాణకు పాకింది. శుక్రవారం ఉదయం ఆందోళన కారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. ‘అగ్నిపథ్’ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టేషన్‌లోకి దూసుకొచ్చిన కొందరు యువకులు పలు రైళ్లకు నిప్పు పెట్టి దహనం చేశారు. ‘సేవ్ ఆర్మీ’ అంటూ నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్‌లోని షాపులు, సీసీ కెమెరాలు, ఫర్నీచర్, అద్దాలు సహా అనేక ఆస్తులను ధ్వంసం చేశారు.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

రైలు పట్టాల మధ్య నిప్పు పెట్టారు. పట్టాలపై సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేసి రైళ్లు కదలకుండా చేశారు. రైల్వేకు చెందిన పార్శిళ్లను కూడా ఆందోళనకారులు దహనం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రైల్వే స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వుతున్నారు. మరోవైపు స్టేషన్‪లోని ప్రయాణికులను పోలీసులు బయటకు పంపేశారు. సికింద్రాబాద్ రావాల్సిన, వెళ్లాల్సిన రైళ్లను అధికారులు రద్దు చేశారు.

Agnipath Scheme : అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు..స్కీమ్‌ రద్దు చేయాలని డిమాండ్

పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ రద్దు చేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని యువకులు అంటున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ పాత విధానంలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.