Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే, గాడిదల్ని పెంచాలని నిర్ణయించుకుని, 2020లో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. తర్వాత 42 లక్షల పెట్టుబడితో, 20 గాడిదల్ని కొన్నాడు. పాల కోసమే గాడిదల్ని పెంచుతున్నాడు.

Donkey Milk Farm: ఐటీ జాబ్ వదిలి గాడిద పాల వ్యాపారం

Donkey Milk Farm

Donkey Milk Farm: గాడిద పాలకు ఉన్న డిమాండ్ చాలా తక్కువ మందికి తెలుసు. ఆయుర్వేదంలో గాడిద పాలను ఎక్కువగా వాడుతారు. నేరుగా పాలను తాగినా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ డిమాండ్‌ను గుర్తించిన మంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా ఐటీ జాబ్ వదిలేసి, గాడిదలను పెంచడం మొదలెట్టాడు. కర్ణాటకలో మొట్టమొదటి డాంకీ ఫామింగ్ ప్రారంభించాడు. దీని ద్వారా గాడిద పాలను ఉత్పత్తి చేస్తున్నాడు.

Presidential Elections: రాష్ట్రపతి ఎన్నిక.. మొదటి రోజు 11 నామినేషన్లు

మంగళూరుకు చెందిన శ్రీనివాస గౌడ అనే వ్యక్తి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అయితే, గాడిదల్ని పెంచాలని నిర్ణయించుకుని, 2020లో ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. తర్వాత 42 లక్షల పెట్టుబడితో, 20 గాడిదల్ని కొన్నాడు. పాల కోసమే గాడిదల్ని పెంచుతున్నాడు. వాటి కోసం ప్రత్యేకంగా ఒక ఫామ్ ఏర్పాటు చేశాడు. ఇది కర్ణాటకలోనే తొలి డాంకీ మిల్క్ ఫామింగ్ సెంటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ తను సొంతంగా గాడిదల్ని పెంచడమే కాదు.. తనలాంటి ఆలోచనలు ఉన్నవాళ్లకు ఈ విషయంలో శిక్షణ కూడా ఇస్తానంటున్నాడు. అలా ఔత్సాహికులకు గాడిదల్ని పెంచడం, పాలు సేకరించడంలో శిక్షణ ఇస్తున్నాడు. మొదట్లో గాడిదల్ని పెంచుతాను అన్నప్పుడు శ్రీనివాస్ సన్నిహితులు చాలా మంది వ్యతిరేకించారు. అయితే, తర్వాత తనకు మద్దతుగా నిలిచారు. ‘‘గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. గాడిద పాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. వీటివల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పాలు తక్కువగా మార్కెట్లో దొరుకుతున్నాయి. అందరికీ గాడిద పాలు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ ఫామ్ స్థాపించాను’’ అని శ్రీనివాస గౌడ చెప్పారు.

Congress headquarters: పోలీసులపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు.. ఎందుకంటే

ప్రస్తుతం గాడిదల నుంచి సేకరించిన పాలను అతడు ప్యాకెట్లలో విక్రయిస్తున్నాడు. షాపింగ్ మాల్స్, షాప్స్, సూపర్ మార్కెట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. 30 మిల్లీ లీటర్ల పాల ధర రూ.150గా ఉందంటే వీటికి ఉన్న డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా, ఇప్పటికే పాలకు సంబంధించి రూ.17 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు శ్రీనివాస గౌడ చెప్పారు.