5 States Elections : కరోనా పేషెంట్లు ఇంటినుంచే ఓటు వేయవచ్చు : కేంద్ర ఎన్నికల సంఘం

యూపీతో సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో ఈసీ పలు కీలక విషయాలు వెల్లడిచింది. కరోనా పేషెంట్లు ఇంటినుంచే ఓటు వేయొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర ప్రకటించారు

Covid Patients Can Cast Their Vote From Home Says CEC : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్న క్రమంలో సీఈసీ సుశీల్ చంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. మరోసారి విజృంభించిన కరోనా ప్రపంచాన్నే వణికిస్తోంది. అన్ని దేశాల్లోనే కేసులు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. భారత్ లో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఈక్రమంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో లక్నోలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సుశీల్ చంద్ర మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు.

Read more : Election Commission: షెడ్యూల్ ప్రకారమే ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ ప్రకటన!

మార్చి మధ్యలో జరగనున్న ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు లక్నోలో మూడు రోజుల పర్యటనకు వెళ్లిన చంద్ర, రాజకీయ పార్టీల ప్రతినిధులతో పాటు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా కోవిడ్ సోకినవారు ఇంటినుంచే ఓటు వేసే సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని సుశీల్ చంద్ర తెలిపారు. అన్ని పార్టీలో ఎన్నికలకు మొగ్గు చూపుతున్నాయని..కరోనా నిబంధనలను పాటిస్తూ ఎన్నికలు నిర్వహించాలంటూ అన్ని రాజకీయ పార్టీలూ కోరాయని తెలిపారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను నిర్ధారిస్తూ షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాయన్నారు.

ఓటర్ల తుది జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఐదు రాష్ట్రాల పోలింగ్ కు సంబంధించి లక్ష పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల దాకా జరుగుతుందన్నారు. అన్ని పోలింగ్ బూత్ లలోనూ వీవీ ప్యాట్ లను ఏర్పాటు చేస్తామని..పోలింగ్‌ బూత్‌ల సంఖ్యను పెంచడంతోపాటు ఓటింగ్‌ సమయాన్ని కూడా గంట సమయాన్ని పెంచుతామని, పోలింగ్‌ అధికారులకు వ్యాక్సిన్‌ వేసి అర్హులైన వారికి బూస్టర్‌ డోస్‌ అందజేస్తామన్నారు.

Read more : Omicron India : దేశంలో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సుశీల్ చంద్ర ఆదేశించారు. కరోనా పేషెంట్లు ఇంటి నుంచే ఓటు వేయొచ్చని..కాబట్టి కరోనా బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఎన్నికల అధికారులు కరోనా పేషెంట్ల ఇంటికి వెళ్లి వారి ఓటును నమోదు చేయిస్తారని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒక్కో బూత్ లో కేవలం 1,200 ఓటర్లకే అనుమతిస్తామన్నారు. అందుకు అనుగుణంగా యూపీలో 11 వేల కేంద్రాలను పెంచామన్నారు.

కాగా..ఈ ఎన్నికల్లో మరో విశేషమేమంటే..18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లే ఎక్కువగా ఉన్నారని సీఈసీ సుశీల్ చంద్ర చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే 18 నుంచి 19 ఏళ్ల వయసున్న ఓటర్లు మూడు రెట్లు పెరిగారని తెలిపారు. అలాగే మహిళా ఓటర్ల నిష్పత్తి కూడా 839 నుంచి 868కి పెరిగిందన్నారు. కరోనా నిబంధనల్ని ప్రతీ ఒక్క ఓటరు కచ్చితంగా పాటించి తీరాల్సిందేనని స్పష్టంచేశారు. ఓట్లర్లు మాస్కులు ధరించి పోలింగ్ బూతులకు రావాలని..లేదంటే ఓటు వేయటానికి లోపలికి అనుమతి ఉండదని తెలిపారు. అలా ప్రతీ ఒక్కు సామాజిక దూరాన్ని పాటించాలని దానికి తగినట్లుగా పోలింగ్ బూత్‌ల సంఖ్యను 11,000 పెంచనున్నామని వెల్లడించారు.

Read more : Corona India : భారత్ లో కరోనా కల్లోలం…ఒక్కరోజే 16,500లకుపైగా పాజిటివ్ కేసులు

 

ట్రెండింగ్ వార్తలు