5G now available on most Oppo 5G smartphones check the list and know if your phone is listed
Oppo 5G Smartphones : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఒప్పో (Oppo) 5G స్మార్ట్‌ఫోన్‌లలో స్టాంటెడ్‌లోన్ (SA) 5G నెట్‌వర్క్ సపోర్టుకు కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందిస్తోంది. Jio 5G SA నెట్‌వర్క్‌లో మెరుగైన 5G ఎక్స్‌పీరియన్స్ పొందాలంటే హైస్పీడ్ ఇంటర్నెట్ ఉండాల్సిందే. అందుకే ఒప్పో (Oppo) జియో (Reliance Jio)తో కలిసి పనిచేస్తోంది.
OPPO Reno 8, Reno 8 Pro వంటి ఫోన్లలో ఇప్పుడు బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నాథ్‌ద్వారాతో సహా ఎంపిక చేసిన 8 నగరాల్లో 5G నెట్‌వర్క్ అందుబాటులో ఉంది. రిలయన్స్ జియో (Jio 5G) నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయ్యేందుకు రెడీగా ఉంది. Oppo 5G స్మార్ట్‌ఫోన్‌లలో రెనో, ఎఫ్ సిరీస్, K సిరీస్‌లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను అందిస్తోంది. Jio 5G స్టాంటెడ్‌లోన్ (SA) నెట్‌వర్క్‌కు సపోర్టు పొందిన Oppo డివైజ్ లిస్టు అందిస్తోంది.
5G now available on most Oppo 5G smartphones check the list and know
Oppo Reno 8
Oppo Reno 8 Pro
Oppo Reno 7
Oppo F21 Pro 5G
Oppo F19 Pro+
Oppo K10
Oppo A53s
Oppo A74
SA నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌తో డివైజ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్న Jio 5G నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయ్యేందుకు రెడీగా ఉన్నాయి. Oppo నవంబర్ 2022 నాటికి మిగిలిన 5G డివైజ్‌లను సంబంధించిన అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తుంది. 5G-రెడీ నెట్‌వర్క్‌తో ఏ సిటీలో నివసిస్తున్న యూజర్లు అయినా 5G నెట్‌వర్క్ పొందవచ్చు.
5G now available on most Oppo 5G smartphones check the list
రాబోయే 5G డివైజ్‌లన్నీ SA, NSAగా ఉంటాయని OPPO ఇండియా VP, R&D హెడ్ తస్లీమ్ ఆరిఫ్ అన్నారు. Oppoతో పాటు, OnePlus నథింగ్ ఫోన్‌తో సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌ల బ్రాండ్‌లు కూడా Jio, Airtel 5Gతో 5G కనెక్టివిటీ కోసం సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను లాంచ్ చేసింది.
Samsung, Xiaomi, Realme డివైజ్‌లలో Jio, Airtel 5Gకి సపోర్టు అందించేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పంపాయి. OnePlus Nord CE 5G, Nord 5G, 10T, ఇతర ఫోన్‌లు కూడా Jio 5G నెట్‌వర్క్‌కు సపోర్టు అప్‌డేట్ అందుబాటులో ఉంది. ఆపిల్ బీటా యూజర్ల కోసం iOS 16.2ను కూడా లాంచ్ చేసింది. Jio, Airtel రెండింటిలోనూ 5G నెట్‌వర్క్‌ను వినియోగించుకోవచ్చు. Apple యూజర్లందరికి డిసెంబర్‌లో iOS 16.2ని రిలీజ్ చేయనుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : Oppo A17k : భారీ బ్యాటరీ, సింగిల్ 8MP కెమెరాలతో ఒప్పో A17k వచ్చేసింది.. ధర ఎంతంటే?