Oppo A17k : భారీ బ్యాటరీ, సింగిల్ 8MP కెమెరాలతో ఒప్పో A17k వచ్చేసింది.. ధర ఎంతంటే?

Oppo A17k : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Oppo భారత మార్కెట్లో Oppo A17kని లాంచ్ చేసింది. కొత్తగా లాంచ్ అయిన Oppo A17 మరింత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. రెండు ఫోన్‌లు డిజైన్ పరంగా ఒకేలా ఉండనున్నాయి.

Oppo A17k : భారీ బ్యాటరీ, సింగిల్ 8MP కెమెరాలతో ఒప్పో A17k వచ్చేసింది.. ధర ఎంతంటే?

Oppo A17k with single 8MP rear camera, 5000mAh battery launched in India

Oppo A17k : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Oppo భారత మార్కెట్లో Oppo A17kని లాంచ్ చేసింది. కొత్తగా లాంచ్ అయిన Oppo A17 మరింత సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. రెండు ఫోన్‌లు డిజైన్ పరంగా ఒకేలా ఉండనున్నాయి. అయినప్పటికీ Oppo A17k సరసమైన ధరకే పొందవచ్చు. కొన్ని ఫీచర్లు మాత్రమే అందించనుంది. ఈ ఫోన్‌లో ఒక వెనుక కెమెరా సెన్సార్ మాత్రమే ఉంది. టెక్నో, రెడ్‌మి నుంచి కనీసం రెండు వెనుక కెమెరా సెన్సార్‌లను కలిగి ఉంది. ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల మాదిరిగా కాకుండా బడ్జెట్ ఫోన్‌లలోని ప్రైమరీ కెమెరా మాత్రమే పనిచేస్తుంది. 8-MP షూటర్ Oppo A17k అద్భుతమైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది.

Oppo A17k with single 8MP rear camera, 5000mAh battery launched in India

Oppo A17k with single 8MP rear camera, 5000mAh battery launched in India

భారత్‌లో Oppo A17k ధర :
Oppo A17K ఒప్పో ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 10,499కి అందుబాటులో ఉంది. సింగిల్ 3GB RAM, 64GB స్టోరేజ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. బ్లాక్, గోల్డ్ కలర్ ఆప్షన్లను కూడా పరిమితంగానే అందిస్తుంది. ఈ నెల ప్రారంభంలో భారత్‌లో ప్రారంభమైన Oppo A17 ధర రూ. 12,499గా ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 4GB RAM, 64GB స్టోరేజ్ ఉన్నాయి. రెండు కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉంది. గోల్డ్ బదులుగా ఆరెంజ్ కలర్ ఆప్షన్‌తో వచ్చింది.

Oppo A17k స్పెసిఫికేషన్స్ ఇవే :
Oppo A17k 1612×720 (HD+) పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. స్క్రీన్‌లో 60Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. వెనుక ప్యానెల్‌లో 8-MP కెమెరా ఉంటుంది. ముందు ప్యానెల్ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ లోపల 5-MP సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా యాప్ నైట్, వీడియో, టైమ్ లాప్స్, ఎక్స్‌పర్ట్, పనోరమా, గూగుల్ లెన్స్ వంటి మోడ్‌లతో వచ్చింది. ప్రైమరీ కెమెరా ఆటో-ఫోకస్‌కు సపోర్టు ఇస్తుంది. సైడ్‌లోని పవర్ బటన్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌గా పనిచేస్తుంది. ఈ ఫోన్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IPX4 రేటింగ్‌ను కలిగి ఉంది.

Oppo A17k with single 8MP rear camera, 5000mAh battery launched in India

Oppo A17k with single 8MP rear camera, 5000mAh battery launched in India

ఇతర ఒప్పో మోడల్స్ మాదిరిగానే, Oppo A17k MediaTek Helio G35 SoC ద్వారా ఆధారితమైనది. కానీ, తక్కువ RAM కాన్ఫిగరేషన్‌తో వచ్చింది. Oppo A17k ఇతర ఫీచర్లతో 5000mAh బ్యాటరీ, డ్యూయల్-సిమ్ స్లాట్, Wi-Fi 5, బ్లూటూత్ v5.3, aptX, aptX HD, LDAC వంటి హై-ఎండ్ కోడెక్‌లకు సపోర్టు ఉన్నాయి. ఫోన్ ఛార్జింగ్ కోసం మైక్రో USB పోర్ట్‌తో వస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Oppo A17 : రూ. 12,499లకే ఒప్పో A17 వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంతంటే?