వనస్థలిపురంలో విషాదం.. కరోనాతో తండ్రీకొడుకు మృతి

  • Publish Date - May 2, 2020 / 02:00 AM IST

కరోనా ఒకే కుటుంబంలోని ఇద్దరి ప్రాణాలను తీసింది. కరోనా సోకిన తండ్రీకొడుకు రెండు రోజుల వ్యవధిలో మృతిచెందారు. ఈ విషాధ ఘటన వనస్థలిపురంలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి మృతిచెందగా ఆయనకు కరోనా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి రెండో కుమారుడు కూడా కరోనాతోనే మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. వృద్ధుడి భార్య, పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో వారితోపాటు కుటుంబ సభ్యులందరిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. 

నగరంలోని వనస్థలిపురంలో నివాసముంటున్న (48) ఇటీవలే కరోనా పాజిటివ్ అనే తేలింది. దాంతో అతడ్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి సోదరుడి నుంచి కరోనా సోకినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇటీవలే బాధితుడి తండ్రి (76) అనారోగ్యంతో చికిత్స పొందతూ మృతిచెందాడు.

అతన్ని పరీక్షించగా కరోనా సోకినట్టు తేలింది. కుటుంబ సభ్యులందరిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఆ కుటుంబంలోని మరో 8 మందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు. వీరంతా ఉండే ప్రాంతమంతా కంటెయిన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. (లాక్ డౌన్ తో బయటపడ్డ  ప్రియుడి బాగోతం)