Himachal Pradesh
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో దారుణం జరిగిది. సరదాగా నదీ స్నానానికి వచ్చిన బృందంలో ఏడుగురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉనా జిల్లాలోని గోవింద్ సాగర్ సరస్సులో సోమవారం జరిగింది. పంజాబ్‌లోని మొహాలికి చెందిన పదకొండు మంది సోమవారం మధ్యాహ్నం గోవింద్ సాగర్ సరస్సు చూసేందుకు వచ్చారు. తర్వాత సరదాగా సరస్సులో దిగి స్నానం చేయాలనుకున్నారు. అందరూ కలిసి స్నానం చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఏడుగురు నీటిలో మునిగిపోయారు.
Jackfruit: పనస పండు కోసం ఏనుగు కష్టం.. వైరల్‌గా మారిన వీడియో
నలుగురు మాత్రమే ప్రాణాలతో బటయపడ్డారు. మరణించిన వారిలో ఆరుగురు యువకులే. వీరి వయసు 16-18 ఏళ్లోలోపే. మరో మృతుడి వయసు 30 ఏళ్లు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు సరస్సు దగ్గరికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. భాక్రా బీస్ మేనేజ్‌మెంట్ బోర్డుకు చెందిన ప్రత్యేక బృందాలు మృతదేహాల కోసం గాలిస్తున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోవింద్ సాగర్ సరస్సు స్థానికంగా చిన్న టూరిస్ట్ స్పాట్‌గా గుర్తింపు తెచ్చుకుంది.