Aadhaar – Mobile Linking : మీ ఆధార్ కార్డును మొబైల్ నెంబర్‌తో లింక్ చేశారా? ఇదిగో సింపుల్ ప్రాసెస్ మీకోసం.. వెంటనే ఇలా చేయండి!

Aadhaar - Mobile Linking : భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా, ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌ను జారీ చేసింది. 12-అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య దేశంలోని నివాసితులకు గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది.

Aadhaar – Mobile Linking : భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా, ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌ను జారీ చేసింది. 12-అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య దేశంలోని నివాసితులకు గుర్తింపు రుజువుగా పనిచేస్తుంది. బయోమెట్రిక్స్, అడ్రస్ ప్రూఫ్, ఫొటోతో సహా డేటా యూజర్ గుర్తింపును ధృవీకరించేందుకు అనుమతిస్తుంది. ఈ గుర్తింపు ప్రక్రియను సులభతరం చేసేందుకు UIDAI మొబైల్ నంబర్‌తో ఆధార్‌ను లింక్ చేయాడాన్ని తప్పనిసరి చేసింది.

అప్పటినుంచి భారతీయులందరూ తమ ఆధార్ కార్డులను మొబైల్ నెంబర్‌తో లింక్ చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికీ కూడా చాలామందికి ఆధార్, మొబైల్ నెంబర్ లింక్ చేయడంపై అవగాహన లేదనే చెప్పాలి. ఎవరైనా ఇంకా తమ ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే వెంటనే లింక్ చేసుకోవడం మంచిది.

లేదంటే.. ప్రభుత్వ పథకాల నుంచి అనేక సర్వీసులను వినియోగించుకోలేరని గమనించాలి. ఇంతకీ మొబైల్‌తో ఆధార్ కార్డ్‌ని లింక్ చేయడం వలన వివిధ ఆధార్ సంబంధిత సర్వీసులను పొందవచ్చు. అలాగే, ఆన్‌లైన్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (SSUP), mAadhaar యాప్, మరిన్నింటిని ఉపయోగించడానికి వీలు చేస్తుంది. ఆధార్ డేటాతో వివిధ లింక్‌లను ధృవీకరించడంతో పాటు మొబైల్ నంబర్ యజమానిని గుర్తించడానికి ప్రభుత్వానికి సాయపడుతుంది.

Aadhaar – mobile number linking _ How to link phone number with Aadhaar

Read Also : Baal Aadhaar Card Update : బాల ఆధార్ కార్డుపై కొత్త మార్గదర్శకాలు.. ఇకపై బయోమెట్రిక్ తప్పనిసరి.. బాల ఆధార్ అంటే ఏంటి? ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసా?

మీ ఆధార్ లింక్ చేయడం కూడా ముఖ్యమైనది. అంతేకాదు.. యూజర్లు తమ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేసినట్లయితే.. మీరు ఎక్కడైనా ఆధార్ పోగొట్టుకున్నట్లయితే.. ఆధార్ కార్డ్ కాపీని కూడా అభ్యర్థించవచ్చు. మీరు కూడా మీ మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయాలనుకుంటున్నారా? లేదా మీ మొబైల్ నంబర్ లింక్ అయిందో లేదో చెక్ చేయాలనుకుంటున్నారా? ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.

మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌తో ఎలా లింక్ చేయాలంటే :

* మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించండి.
* ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన ఆధార్ కరెక్షన్ ఫారమ్‌ను వివరాలతో నింపండి.
* ఆ తర్వాత, మీరు మీ ఆధార్ కార్డ్‌లో అప్‌డేట్ చేయాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.
* ఆధార్ ఎగ్జిక్యూటివ్ అథెంటికేషన్ కోసం మీ బయోమెట్రిక్‌లను తీసుకుని చివరకు ఫారమ్‌ను సమర్పించాలి.
* మీ అభ్యర్థనకు సంబంధించిన అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN)స్లిప్‌ను ఉంచుకోండి.
* ఎగ్జిక్యూటివ్ మీ అభ్యర్థనకు సంబంధించిన రసీదు స్లిప్‌ను మీకు అందిస్తారు.
* ఆధార్ అప్‌డేషన్ స్టేటస్ ట్రాక్ చేసేందుకు అప్‌డేట్ రిక్వెస్ట్ నంబర్‌ని ఉపయోగించవచ్చు.
* లింకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత.. మీ మొబైల్ నంబర్‌ను మీ ఆధార్‌తో నమోదు చేసుకోవాలి.
* ఆ తర్వాత అనేక సౌకర్యాలను పొందడం కోసం మీరు ఆధార్ OTPలను అందుకుంటారు.
* ఆధార్ అప్‌డేట్ స్టేటస్ పొందడానికి మీరు UIDAI టోల్-ఫ్రీ నంబర్ 1947కి కూడా కాల్ చేయవచ్చు.

మొబైల్ నంబర్‌కు ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో ఎలా చెక్ చేయాలంటే :

* యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
* https://uidai.gov.in/ హోమ్‌పేజీలో అందుబాటులో My Aadhaar ఆప్షన్ పై Tap చేయండి.
* డ్రాప్-డౌన్ మెను నుంచి ఆధార్ సర్వీసుల కింద.. రిజిస్టర్ అయిన మొబైల్ లేదా ఈ-మెయిల్ ఐడిని Verify ఆప్షన్‌పై Click చేయండి.
* ఓపెన్ అయిన కొత్త ట్యాబ్‌లో మీరు వెరిఫై చేయాలనుకునే ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ IDని నమోదు చేయండి.
* ఇప్పుడు Captcha కోడ్‌ను నమోదు చేసి, Send OTPపై Click చేయండి.
* మొబైల్ నంబర్ UIDAI రికార్డులతో సరిపోలితే.. మీకు ఫ్లాష్ కనిపిస్తుంది.
* మీరు నమోదు చేసిన మొబైల్ ఇప్పటికే ఉన్న రికార్డ్‌లతో వెరిఫై అయినట్టుగా ఉంటే మెసేజ్ కనిపిస్తుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : UIDAI Aadhaar : ఆధార్‌ విషయంలో తస్మాత్ జాగ్రత్త.. ఆన్‌లైన్ వెరిఫికేషన్ లేకుండా అసలే వాడొద్దు.. UIDAI హెచ్చరిక..!

ట్రెండింగ్ వార్తలు