Baal Aadhaar Card Update : బాల ఆధార్ కార్డుపై కొత్త మార్గదర్శకాలు.. ఇకపై బయోమెట్రిక్ తప్పనిసరి.. బాల ఆధార్ అంటే ఏంటి? ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసా?

Baal Aadhaar Card Update : పిల్లల ఆధార్ కార్డు.. బాల్ ఆధార్‌కు సంబంధించి విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ డేటాలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ తప్పనిసరి చేస్తూ అథారిటీ మార్గదర్శకాలను జారీ చేసింది.

Baal Aadhaar Card Update : బాల ఆధార్ కార్డుపై కొత్త మార్గదర్శకాలు.. ఇకపై బయోమెట్రిక్ తప్పనిసరి.. బాల ఆధార్ అంటే ఏంటి? ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసా?

Baal Aadhaar Card biometric update mandatory what is it, how to update

Baal Aadhaar Card Update : పిల్లల ఆధార్ కార్డు.. బాల్ ఆధార్‌కు సంబంధించి విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కొత్త మార్గదర్శకాన్ని విడుదల చేసింది. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు ఆధార్ డేటాలో బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ తప్పనిసరి చేస్తూ అథారిటీ మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు UIDAI ట్విట్టర్‌లో వెల్లడించింది. 5-15 సంవత్సరాల మధ్య పిల్లల బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడం తప్పనిసరి చేసినట్టు తెలిపింది. ఈ ప్రక్రియ ఉచితంగానే ఉంటుందని తెలియజేసింది.

దాంతో పాటు బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసిన తర్వాత పిల్లల ఆధార్ నంబర్‌లో ఎలాంటి మార్పు ఉండదని UIDAI మరో ట్వీట్‌లో ప్రకటించింది. తల్లిదండ్రులు ఫారమ్‌ను నింపడానికి వారి పిల్లల బయోమెట్రిక్ డేటాను అప్‌డేట్ చేయడానికి సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలని కోరింది. UIDAI అధికారిక పోస్ట్‌లో పిల్లల ఆధార్‌కు రెండు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్‌లు అవసరమని తెలియజేసింది. పిల్లలకి 5 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మొదటి బయోమెట్రిక్ అప్‌డేట్ చేయాలి. ఆ తర్వాత15 ఏళ్ల వయస్సులో రెండవది చేయాలి.

బాల్ ఆధార్ అంటే ఏమిటి? :
12-అంకెల ఆధార్‌ను నియంత్రించే UIDAI 5 ఏళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు బాల్ ఆధార్ కార్డ్‌ను జారీ చేస్తుంది. పుట్టినప్పటి నుంచి పిల్లలకు డిజిటల్ ఫోటో గుర్తింపు రుజువుగా వివిధ సంక్షేమ ప్రయోజనాలు, విధులకు కార్డ్ యాక్సెస్‌ను అందిస్తుంది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో వేలిముద్రల వంటి బయోమెట్రిక్‌లు స్పష్టంగా కనిపించవు. కాబట్టి. వేలిముద్రలు, ఐరిస్ స్కాన్‌ల వంటి బయోమెట్రిక్ డేటా బాల్ ఆధార్ కార్డ్‌లో చేర్చరు. కాబట్టి పిల్లలు ఐదేళ్ల వయస్సు వచ్చిన తర్వాత వారి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

బ్లూ కలర్ ఆధార్ కార్డ్ అంటే ఏమిటి? :
సాధారణ ఆధార్ నుంచి బాల్ ఆధార్‌ను వేరు చేసేందుకు UIDAI 0-5 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు బ్లూ కలర్ ఆధార్ కార్డ్‌లను జారీ చేస్తుంది. బిడ్డకు 5 ఏళ్లు వచ్చిన తర్వాత బ్లూ కలర్ బాల్ ఆధార్ చెల్లదు. ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఐదు సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత వారి బయోమెట్రిక్‌లతో ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయాలి.

Baal Aadhaar Card biometric update mandatory what is it, how to update

Baal Aadhaar Card biometric update mandatory what is it, how to update

బాల్ ఆధార్ కార్డ్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? :

* UIDAI అధికారిక వెబ్‌సైట్ uidai.gov.inని విజిట్ చేయండి.
* ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* పిల్లల పేరు, గార్డియన్/తల్లిదండ్రుల ఫోన్ నంబర్, పిల్లవాడు గార్డియన్/తల్లిదండ్రులకు సంబంధించిన ఇతర బయోమెట్రిక్ డేటా వంటి తప్పనిసరి సమాచారాన్ని నింపాలి.
* ఆ తర్వాత ఇంటి అడ్రస్, ప్రాంతం, రాష్ట్రం, ఇతరులతో సహా కుటుంబ సభ్యుల వివరాలను నింపండి.
* అన్ని వివరాలను రివ్యూ చేసుకుని Submit చేయండి.
* ఆ తర్వాత అపాయింట్‌మెంట్ ఆప్షన్‌పై Click చేయండి.
* సమీపంలోని ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లి అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేయండి.
* మీ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, రిలేషన్ షిప్ ప్రూఫ్, పుట్టిన తేదీ, రిఫరెన్స్ నంబర్ వంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అవసరం.
* ఆధార్ ఎగ్జిక్యూటివ్ ప్రక్రియను మరింతగా పూర్తి చేయాల్సి ఉంది. దరఖాస్తు ప్రక్రియను ట్రాక్ చేసేందుకు రసీదు సంఖ్యను అందిస్తారు.
* 60 రోజుల్లోగా మీ అడ్రస్‌కు ఆధార్ కార్డ్ పోస్ట్ చేయడం జరుగుతుంది.

బాల్ ఆధార్ కార్డ్‌ని ఎలా అప్‌డేట్ చేయాలి?
మీ పిల్లల ఆధార్‌లో బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేసేందుకు uidai.gov.inని విజిట్ చేయండి. మీ పిల్లల ఆధార్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చేయడానికి అపాయింట్‌మెంట్ బుక్ చేయండి. మీ పిల్లల జనన ధృవీకరణ పత్రం, గుర్తింపు రుజువు, చిరునామా డాక్యుమెంట్లతో ఆధార్ నమోదు కేంద్రాన్ని విజిట్ చేయండి.

బాల్ ఆధార్ కార్డ్‌ని రిజిస్టర్ చేసేటప్పుడు లేదా అప్‌డేట్ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు కూడా తమ ఆధార్ కార్డ్‌ని సమర్పించాలి. ఆధార్ ఎగ్జిక్యూటివ్ పిల్లల ఫేస్ ఫొటో, వేలిముద్రల వంటి బయోమెట్రిక్‌లను యాడ్ చేస్తారు. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ఆధార్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన రసీదు స్లిప్‌ను జాగ్రత్త చేసి పెట్టుకోండి.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : New Aadhaar Rules : ఆధార్ కొత్త నిబంధనలు.. ఇకపై పదేళ్లకు ఒకసారి మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సిందే..!