New Aadhaar Rules : ఆధార్ కొత్త నిబంధనలు.. ఇకపై పదేళ్లకు ఒకసారి మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సిందే..!

New Aadhaar Rules : ఆధార్ (Aadhaar) కార్డుదారులకు అలర్ట్.. ఆధార్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అయిన తేదీ నుంచి కనీసం 10 ఏళ్లకు ఒకసారి తమ డాక్యుమెంట్లను, ఆధార్ కార్డుకు సంబంధించిన డేటాను అప్‌డేట్ చేయాలని కేంద్రం సూచిస్తోంది.

New Aadhaar Rules : ఆధార్ కొత్త నిబంధనలు.. ఇకపై పదేళ్లకు ఒకసారి మీ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాల్సిందే..!

New Aadhaar Rules Govt advises everyone to update Aadhaar details once in 10 years

New Aadhaar Rules : ఆధార్ (Aadhaar) కార్డుదారులకు అలర్ట్.. ఆధార్ నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ అయిన తేదీ నుంచి కనీసం 10 ఏళ్లకు ఒకసారి తమ డాక్యుమెంట్లను, ఆధార్ కార్డుకు సంబంధించిన డేటాను అప్‌డేట్ చేయాలని కేంద్రం సూచిస్తోంది. ఈ ప్రక్రియ సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోజిటరీ (CIDR)లో సమాచారం కచ్చితత్వాన్ని నిర్ధారించవచ్చు. ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఆధార్ నంబర్ హోల్డర్లు, ఆధార్ కోసం ఎన్‌రోల్‌మెంట్ చేసిన తేదీ నుంచి ప్రతి 10 సంవత్సరాలకు గుర్తింపు రుజువును సమర్పించాల్సి ఉంటుంది.

ఆధార్‌లో సపోర్టింగ్ డాక్యుమెంట్లను కనీసం ఒక్కసారైనా అప్‌డేట్ చేయవచ్చు. (POI), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ (POA) డాక్యుమెంట్లు, CIDRలో వారి సమాచారం నిరంతర కచ్చితత్వాన్ని నిర్ధారించవచ్చు. ఆధార్ అథారిటీ ఎప్పటికప్పుడు డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసే ప్రక్రియ తప్పనిసరి కానప్పటికీ.. యూజర్లు తమ ఆధార్ సపోర్టింగ్ డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వినియోగాదారుల వివరాల్లో మార్పులను చేసుకునేలా ఆధార్ (Enrolment and Update ) నిబంధనలు అప్‌డేట్ అయ్యాయి.

New Aadhaar Rules Govt advises everyone to update Aadhaar details once in 10 years

New Aadhaar Rules Govt advises everyone to update Aadhaar details once in 10 years

Uidai ఒక వినియోగదారు పేరు, ఫోటోతో ఆధార్ కోసం POI (Proof of Identity) డాక్యుమెంట్లను పొందవచ్చు. ప్రూఫ్ సమర్పించే ఐడెంటిఫికేసన్ డాక్యుమెంట్లలో పాస్‌పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ ID కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మరిన్ని ఉన్నాయి. యూజర్ల డాక్యుమెంట్‌లను అప్‌డేట్ చేసేందుకు UDAI ఇప్పటికే స్పెషల్ ఫీచర్‌ను యాడ్ చేసింది. myAadhaar పోర్టల్‌లో ‘update document’, myAadhaar యాప్ ఉన్నాయి. ఈ సదుపాయాన్ని పొందేందుకు మీరు ఏదైనా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ కూడా విజిట్ చేయవచ్చు.

కొత్త ఫీచర్ ఆధార్ కార్డ్ హోల్డర్‌లు POI, POA (పేరు, అడ్రస్) డాక్యుమెంట్లను అప్‌డేట్ చేయడం ద్వారా వివరాలను అప్‌డేట్ చేసేందుకు అనుమతిస్తుంది. మీరు మీ అడ్రస్ వివరాలను ఆన్‌లైన్‌లో సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ (SSUP)లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్‌పై ఇతర వివరాల అప్‌డేట్ కోసం, డెమోగ్రాఫిక్ వివరాలు (పేరు, అడ్రస్, DoB, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్) అలాగే బయోమెట్రిక్స్ (ఫింగర్ ప్రింట్స్, ఐరిస్) & ఫోటోగ్రాఫ్) ఆధార్‌లో అప్ డేట్ చేసుకునేందుకు పర్మినెంట్ నెంబర్ నమోదు కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp: వాట్సాప్‭ గ్రూపులు ఎక్కువగా ఉన్నవారి కోసం మెటా కొత్త ఫీచర్