WhatsApp: వాట్సాప్‭ గ్రూపులు ఎక్కువగా ఉన్నవారి కోసం మెటా కొత్త ఫీచర్

కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ గ్రూపులోని సభ్యుల సంఖ్యలను 1024కు పెంచింది వాట్సాప్ మాతృసంస్థ మెటా. దీంతో గతంలో కంటే గ్రూపు నోటిఫికేషన్ల బాధ ఇప్పుడు ఎక్కువే అయింది. పైగా కొత్త గ్రూపులు రావడం, వాటిని మ్యూట్‭లో పెట్టకపోవడం వంటి సమస్యల కారణంగా, ఆటోమేటిక్ మ్యూట్‭ డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్‭కు అనుగుణంగా తాజా ఫీచర్‭ను తీసుకువస్తున్నారు.

WhatsApp: వాట్సాప్‭ గ్రూపులు ఎక్కువగా ఉన్నవారి కోసం మెటా కొత్త ఫీచర్

WhatsApp working on auto mute feature for large group chats

WhatsApp: కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ యూజర్లకు ఎప్పటికప్పుడు నూతనంగా, సులభంగా ఉడడంలో వాట్సాప్ ముందుంటుంది. బహుశా అదే కారణం కాబోలు.. ఎన్ని మెసెజింగ్ ప్లాట్‭ఫాంలు ఉన్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అటుఇటుగా సగం మంది ఇప్పటికీ వాట్సాప్‭నే ఉపయోగిస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. మరో సరికొత్త ఫీచర్‭ను వాట్సాప్ తీసుకురానుంది.

వాట్సాప్ గ్రూపులు ఎక్కువగా ఉన్నవారికి ఇది చాలా ఉపయోగపడే ఫీచర్. గ్రూపుల కారణంగా చాలా మంది నోటిఫికేషన్లతో ఇబ్బంది పడుతుంటారు. కొన్నిసార్లు గ్రూపుని సైలెంట్లో పెట్టడం మర్చిపోవడం వల్ల కూడా వరుస నోటిఫికేషన్లు ఇబ్బందికరంగా ఉంటాయి. దీనికి పరిష్కారమే ఈ కొత్త ఫీచర్. గ్రూపులో 254 మందికి మించి ఉంటే ఆ గ్రూపు ఆటోమేటిక్‭గా మ్యూట్‭లో పడిపోతుంది. దీంతో నోటిఫికేషన్ల శబ్దం తగ్గుతుంది.

కొద్ది రోజుల క్రితమే వాట్సాప్ గ్రూపులోని సభ్యుల సంఖ్యలను 1024కు పెంచింది వాట్సాప్ మాతృసంస్థ మెటా. దీంతో గతంలో కంటే గ్రూపు నోటిఫికేషన్ల బాధ ఇప్పుడు ఎక్కువే అయింది. పైగా కొత్త గ్రూపులు రావడం, వాటిని మ్యూట్‭లో పెట్టకపోవడం వంటి సమస్యల కారణంగా, ఆటోమేటిక్ మ్యూట్‭ డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్‭కు అనుగుణంగా తాజా ఫీచర్‭ను తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం ఇది ప్రయోగదశలో ఉందని, బీటా వర్సెన్ వారికి ముందుగా అందుబాటులోకి తీసుకువచ్చి, అనంతరం మిగిలిన యూజర్లందరికీ అందుబాటులోకి తేవాలని మెటా యాజమాన్యం భావిస్తోందట.

Blue Tick: ముందుకు.. వెనక్కి.. మళ్లీ ముందుకు.. బ్లూటిక్‭పై ట్విట్టర్ దోబూచులాట