Weather Forecast: చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు.. నేడు ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం

తెలుగు రాష్ట్రాల్లో రుతుపవ నాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉంది. దీంతో రాగల మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Weather Forecast: తెలుగు రాష్ట్రాల్లో రుతుపవ నాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఉంది. దీంతో రాగల మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపు లతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

Rains In Telangana: తెలంగాణలో మోస్తరు వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో 6.4 సెం.మీ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నేరెడ్ మెట్ లో 5.4 సెం.మీ, అల్వాల్ కొత్త బస్తీ ప్రాంతంలో 5.3 సెం.మీ, కందిలో 5 సెం.మీ, మహేశ్ నగర్ లో 4.4. సెం.మీ వర్షం కురిసింది. బుధవారం తెలంగాణలోని దాదాపు అ న్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ అధికారులు తెలిపారు.

Assan Rains: వర్షాలు.. వరదలతో.. అసోం అతలాకుతలం

ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, యానాం, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల బుధవారం భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 మధ్య పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో 123.25 మిల్లీమీటర్లు, భీమవరం మండలం గొల్లవానితిప్పలో 95.75, విజయనగరం జిల్లా తెర్లాం మండలం కాగంలో 91 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.

ట్రెండింగ్ వార్తలు