Siddhaanth Vir Surryavanshi : పునీత్ లానే.. సినీ పరిశ్రమలో మరో విషాదం.. జిమ్ చేస్తూ నటుడు మృతి

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లానే మరో నటుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మృతి చెందాడు.

Siddhaanth Vir Surryavanshi : పునీత్ లానే.. సినీ పరిశ్రమలో మరో విషాదం.. జిమ్ చేస్తూ నటుడు మృతి

Updated On : November 11, 2022 / 5:49 PM IST

Siddhaanth Vir Surryavanshi : సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరో నటుడు జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మృతి చెందాడు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పు మరణవార్తను ఇప్పటికీ ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పు మరణం తర్వాత జిమ్ లో అధిక వర్కౌట్స్ చేయొద్దని డాక్టర్లు సూచనలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా పునీత్ లానే ఒక నటుడు జిమ్ చేస్తూ మృతి చెందడం ఇండస్ట్రీలో విషాదం నింపింది.

Siddhaanth Vir Surryavanshi

బాలీవుడ్ టీవీ నటుడు ఆనంద్ వీర్ సూర్యవంశీ అకస్మాత్తుగా చనిపోయాడు. సిద్ధాంత్ వీర్ సూర్యవంశీగా పాపులర్ అయిన అతడు.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ కుప్పకూలాడు. నేటి ఉదయం సిద్దాంత్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా అప్పటికే ఆటను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కసౌథీ జిందగీ కే సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్న సిద్దాంత్ పలు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. కొన్ని సినిమాల్లో కూడా కనిపించాడు. కృష్ణా అర్జున్, క్యా దిల్ మే హై, కోయీ హై, సూఫియానా మేరా ఇష్క్ హై సీరియల్స్‌లో సిద్ధాంత్ నటించాడు. క్యూ రిస్తో మే కట్టీ బట్టీ, జిద్దీ దిల్.. సిద్ధాంత్.. చివరి టీవీ షో ప్రాజెక్టులు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సిద్ధాంత్ భార్య సూపర్ మోడల్ అలేషియా రౌత్. 46 ఏళ్ల సిద్దాంత్ ఎప్పుడు ఫిట్ గా ఉండడం కోసం జిమ్ లో నిత్యం కసరత్తులు చేస్తుండే వాడు. సిద్దాంత్ మరణం పట్ల బాలీవుడ్ ప్రముఖులు, అతడి సన్నిహితులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Siddhaanth Vir Surryavanshi

సిద్ధాంత్ మొదట మీడియాకు చెందిన ఇరా చౌదరిని పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఒక కూతురు ఉంది. 2015లో ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తర్వాత సూపర్ మోడల్ అలేషియా రౌత్ ను సిద్ధాంత్ 2017లో వివాహం చేసుకున్నాడు. అలేషియా రౌత్ కు ఇది రెండో పెళ్లి.

ఇటీవల కాలంలో పలువురు సెలెబ్రిటీలు ఇలా జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురై మృతి చెందారు. కన్నడ స్టార్ హీరో పునీత్ కూడా ఇలానే జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ శ్రీవాస్తవ్ కూడా జిమ్‌లో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆస్పత్రిలో కోమాలో ఉండి చికిత్స తీసుకున్నారు. చివరకు మృతి చెందారు. ఇక కేకే, రాజీవ్ శుక్లా లాంటి వారు సైతం గుండెపోటుతో మరణించారని బాలీవుడ్ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.