Actor Vishnu Vishal And Badminton Player Gutta Jwala Are Getting Married On 22nd April 2021
Gutta Jwala – Vishnu Vishal: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా తన ప్రియుడు విష్ణు విశాల్‌తో ఏడడుగులు వెయ్యబోతున్నారు. జ్వాల గుత్తా, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ గతకొద్ది కాలంగా రిలేషన్లో ఉన్నారు. ఏప్రిల్ 22న మేమిద్దరం ఒక్కటి కాబోతున్నాం అంటూ విష్ణు తమ వెడ్డింగ్‌ని కార్డ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటే.. : విరహవేదన తట్టుకోలేక పోతున్న ప్రేమికులు..
2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని జ్వాల మ్యారేజ్ చేసుకుంది. 2011లో వీళ్లు విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నారు.. విష్ణు విశాల్ వివాహం 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీతో జరిగింది. వీరికి ఆర్యన్ అనే బాబు ఉన్నాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
జ్వాలను ఫస్ట్ టైం అక్కడ చూశా.. ఫ్లాట్ అయిపోయా..
విష్ణు, జ్వాల కంటే ఒక సంవత్సరం చిన్నవాడు కావడం, వీరిద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం విశేషం.. గతకొద్ది కాలంగా లవ్, డేటింగ్ వంటి వార్తల్లో నిలిచిన ఈ జంట మొత్తానికి పెళ్లి చేసుకోబోతున్నారంటూ క్రీడా, సినీ ప్రముఖులు వీరిద్దరికి విషెస్ చెబుతున్నారు.
LIFE IS A JOURNEY….
EMBRACE IT…HAVE FAITH AND TAKE THE LEAP….
Need all your love and support as always…@Guttajwala#JWALAVISHED pic.twitter.com/eSFTvmPSE2
— VISHNU VISHAL – V V (@TheVishnuVishal) April 13, 2021