నువ్వక్కడుంటే.. నేనిక్కడుంటే.. : విరహవేదన తట్టుకోలేక పోతున్న ప్రేమికులు..
లాక్డౌన్ ఎఫెక్ట్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్నానంటూ ట్వీట్ చేసింది..

లాక్డౌన్ ఎఫెక్ట్ : బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్నానంటూ ట్వీట్ చేసింది..
గుత్తా జ్వాల తన ప్రియుడు విష్ణు విశాల్‌ను బాగా మిస్ అవుతందట పాపం.. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్‌ల గతకొద్ది కాలంగా రిలేషన్లో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ సందర్భంగా గుత్తా జ్వాలా హైదరాబాద్‌లో, ఆమె ప్రియుడు విష్ణువిశాల్ చెన్నైలో ఉండిపోయారు. దీనిపై ‘‘నా బూను మిస్ అవుతున్నాను’’ అంటూ గుత్తా జ్వాలా విచారకరమైన ఎమోజీలతో ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన విష్ణువిశాల్ ‘‘ దీనికి ఓకే, ఇప్పుడు సామాజిక దూరం పాటించడం ముఖ్యం’’ అంటూ ఆలోచనాత్మకంగా సమాధానం ఇచ్చారు. పాపం ప్రేమికులు విరహ వేదన తట్టుకోలేక పోతున్నారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2005లో తోటి బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని జ్వాల మ్యారేజ్ చేసుకుంది. 2011లో వీళ్లు విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నాడు..
విష్ణు విశాల్ వివాహం 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీతో జరిగింది. వీరికి ఆర్యన్ అనే బాబు ఉన్నాడు. 2018లో ఈ జంట విడాకులు తీసుకున్నారు.
విష్ణు, జ్వాల కంటే ఒక సంవత్సరం చిన్నవాడు కావడం విశేషం.. ప్రస్తుతం ప్రేమలో ఉన్నామని, పెళ్లెప్పుడనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదని ఇటీవల ఓ ఇంటర్వూలో జ్వాల చెప్పిన సంగతి తెలిసిందే.
Missing my boo ?? pic.twitter.com/IPQoQUgpSB
— Gutta Jwala (@Guttajwala) March 28, 2020
Read Also : నర్సుగా మారిన నటి.. కరోనాతో పోరాడుతున్న వారికి చికిత్స..