జ్వాలను ఫస్ట్ టైం అక్కడ చూశా.. ఫ్లాట్ అయిపోయా..

జ్వాల గుత్తాతో పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పిన విష్ణు విశాల్..

  • Published By: sekhar ,Published On : May 7, 2020 / 10:09 AM IST
జ్వాలను ఫస్ట్ టైం అక్కడ చూశా.. ఫ్లాట్ అయిపోయా..

జ్వాల గుత్తాతో పరిచయం ఎలా ఏర్పడిందో చెప్పిన విష్ణు విశాల్..

సాధారణంగా ఎదుటి వ్యక్తి తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలనే కుతూహలం అందరికీ ఉంటుంది. అందులోనూ సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి వ్యవహారాల గురించి అయితే చెప్పక్కర్లేదు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాల గుత్తా, తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ గతకొద్ది కాలంగా రిలేషన్లో ఉన్నారు.

లాక్‌డౌన్ సందర్భంగా జ్వాల హైదరాబాద్‌లో, ఆమె ప్రియుడు విష్ణువిశాల్ చెన్నైలో ఉండిపోయారు. తాజాగా ఇన్‌స్టా చాట్‌లో జ్వాలతో పరిచయం ఎలా జరిగింది అని అడగ్గా విష్ణు.. ‘నటుడు విశాల్ సిస్టర్ ఐశ్వర్య సంగీత్ ఫంక్షన్‌లో ఫస్ట్ టైం జ్వాలను చూశా.. అప్పుడు పరిచయం ఏర్పడింది, తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం’ అని చెప్పుకొచ్చాడు. త్వరలో తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు విష్ణు విశాల్.

Also Read | శివాజీ రాజాకు స్టెంట్ వేసిన వైద్యులు.. నిలకడగా ఆరోగ్యం..