Arpita Mukherjee : మంత్రి వారానికోసారి నా ఇంటికి వచ్చేవారు-నటి అర్పిత

పశ్చిమ బెంగాల్‌లో  ఉద్యోగ నియామకాల  స్కామ్ కేసు దర్యాప్తు‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు.

Arpita Mukherjee : పశ్చిమ బెంగాల్‌లో  ఉద్యోగ నియామకాల  స్కామ్ కేసు దర్యాప్తు‌లో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నటి అర్పిత ముఖర్జీ పలు ఆసక్తి కర విషయాలు వెల్లడించారు. విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్లు ఆమె చెప్పారు. ఒక బెంగాలీ నటుడు తనను మంత్రికి పరిచయం చేశారని చెప్పుకొచ్చారు.

తన ఇంట్లో దొరికిన రూ. 21 కోట్ల రూపాయల డబ్బు పార్థా ఛటర్జీదే అని ఆమె వివరించారు. ఆ డబ్బుకు పార్థా మనుషులే సెక్యూరిటీగా ఉండేవారని ఆమె తెలిపారు. వారు మాత్రమే ఆ రూమ్ లోకి వెళ్లి వచ్చే వారని అర్పిత తెలిపారు.  తన ఇంట్లో ఒక రూమ్‌ను   ఆయన మినీ బ్యాంకులా వాడుకున్నారని… తనతో పాటు మరో మహిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంకులా వాడుకున్నట్లు అర్పిత చెప్పారు.

పార్థా ఛటర్జీ తన ఇంటికి వారానికో, 10 రోజులకోసారో  వచ్చి వెళ్లే వారని ఆమె తెలిపారు. వచ్చిన తర్వాత ఆ రూమ్ లోకి వెళ్లి డబ్బులు లెక్క చూసుకుని తిరిగి వెళ్లిపోయేవారని ఆమె పేర్కోంది. అయితే ఆ డబ్బంతా… కాలేజీల విషయంలోనే లంచాల రూపంలో వచ్చిందని స్పష్టం చేసింది.

కాగా వీరిద్దరూ ఆగస్టు 3వ తేదీ వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. ఈ సమయంలో మరిన్నివిషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మరో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్యను ఈరోజు ఉదయం 11 గంటల నుంచి విచారిస్తోంది.

Also Read : Tihar Jail: జైలులో ఉగ్ర‌వాది యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష‌.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

ట్రెండింగ్ వార్తలు