Tihar Jail: జైలులో ఉగ్ర‌వాది యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష‌.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

ఢిల్లీలోని తిహాడ్ జైలులో జీవిత‌ఖైదు అనుభ‌విస్తోన్న ఉగ్ర‌వాది, నిషేధిత జ‌మ్మూక‌శ్మీర్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్‌) చీఫ్ యాసిన్ మాలిక్ కొన్ని రోజులుగా కారాగారంలోనే నిరాహార దీక్ష చేస్తున్నాడు. దీంతో యాసిన్ మాలిక్ ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేక‌పోవ‌డంతో అత‌డిని పోలీసులు ఇవాళ‌ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Tihar Jail: జైలులో ఉగ్ర‌వాది యాసిన్ మాలిక్ నిరాహార దీక్ష‌.. ఆసుప‌త్రికి త‌ర‌లింపు

Yasin Malik

Tihar Jail: ఢిల్లీలోని తిహాడ్ జైలులో జీవిత‌ఖైదు అనుభ‌విస్తోన్న ఉగ్ర‌వాది, నిషేధిత జ‌మ్మూక‌శ్మీర్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్‌) చీఫ్ యాసిన్ మాలిక్ కొన్ని రోజులుగా కారాగారంలోనే నిరాహార దీక్ష చేస్తున్నాడు. దీంతో యాసిన్ మాలిక్ ఆరోగ్య ప‌రిస్థితి బాగోలేక‌పోవ‌డంతో అత‌డిని పోలీసులు ఇవాళ‌ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఉగ్రవాదులు, ఉగ్రవాద‌ కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో యాసిన్‌ మాలిక్‌ను దోషిగా తేల్చిన పటియాలా హౌస్‌ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టు అత‌డికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన‌ర విష‌యం తెలిసిందే. అంత‌కుముందు యాసిన్‌ మాలిక్‌ తన నేరాన్ని అంగీకరించాడు.

జైలులో అత‌డు జూలై 22 నుంచి నిరాహార దీక్ష ప్రారంభించాడు. 1989లో అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ కుమార్తె రుబైయా సయీద్‌ను అపహరించాడని మాలిక్‌పై అభియోగం ఉంది. ఇందుకు సంబంధించిన కేసులో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యేందుకు, అలాగే, సాక్షులను స్వయంగా క్రాస్‌ ఎగ్జామిన్‌ చేసేందుకు వీలుగా తనను జమ్ము జైలుకు తరలించాలని మాలిక్‌ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో నిరాహార దీక్ష చేప‌ట్టాడు. ఆసుప‌త్రిలోనూ అత‌డు నిరాహార దీక్ష కొన‌సాగించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.