మాజీ ముఖ్యమంత్రి మనువడిని మనువాడనున్న మెహ్రీన్

మాజీ ముఖ్యమంత్రి మనువడిని మనువాడనున్న మెహ్రీన్

Updated On : February 16, 2021 / 1:01 PM IST

Mehreen Pirzadaa: మెహ్రీన్ కౌర్ పిర్జాదా.. నాని ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘మహానుభావుడు’, ‘C/O సూర్య’, ‘జవాన్’, ‘కవచం’, ‘చాణక్య’, ‘ఎంతమంచి వాడవురా’, ‘అశ్వద్థామ’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘ఎఫ్ 2’ తో కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ పంజాబీ బ్యూటీ ఇప్పుడు ‘ఎఫ్ 3’ లో నటిస్తోంది.

ఈ సినిమాతో మెహ్రీన్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోంది. ఎందుకంటే త్వరలో పెళ్లి పీటలెక్కబోతుంది. ఏకంగా ఓ మాజీ ముఖ్యమంత్రి మనువడిని మనువాడనుంది మెహ్రీన్.. కాబోయే భర్త బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియా ద్వారా విషెస్ చెబుతూ తన పెళ్లి విషయాన్ని కన్ఫమ్ చేసేసింది మెహ్రీన్.

Mehreen Pirzadaa

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ కుటుంబానికి కోడలిగా వెళ్తుంది మెహ్రీన్. కాంగ్రెస్ నేత, ఆడంపూర్ ఎమ్మెల్యే కుల్‌దీప్ బిష్ణోయ్ కొడుకు భవ్యా బిష్ణోయ్‌ను పెళ్లాడనుంది మెహ్రీన్. హర్యానాలో బాగా రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం ఇది. మెహ్రీన్‌కు కాబోయే వరుడి తాత భజన్ లాల్ హర్యానాకు ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. మార్చ్ 12న రాజస్థాన్‌లోని జైపూర్‌గలా అలియా ఫోర్ట్ విల్లాలో వీరి నిశ్చితార్థం జరగనుంది.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN ?? (@mehreenpirzadaa)