Manoj Pande
Manoj Pande: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’తో ఇటు దేశ యువతకు, అటు ఆర్మీకి.. ఇద్దరికీ ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే. ‘అగ్నిపథ్’ స్కీంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ అంశంపై అవగాహన లేకుండా యువత తప్పుదోవ పట్టొద్దని సూచించారు. ‘‘ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ విషయంలో వెనుకడుగు వేసే అవకాశం లేదు. పథకం అమల్లోకి వచ్చే సరికల్లా ఎన్నో అనుకూలమైన మార్పులు ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్పులు జరుగుతాయి.
PM Modi: త్రివిధ దళాధిపతులతో రేపు మోదీ భేటీ
ఈ పథకం తమకు ఎంతో మేలు చేస్తుందనే విషయాన్ని యువత అర్థం చేసుకోవాలి. ఈ స్కీంతో ఇటు యువతకు, అటు దేశానికి, ఆర్మీకి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి, యువత తప్పుదోవ పట్టొద్దు. ఈ పథకం గురించి సరైన సమాచారం లేకపోవడం వల్లే తాజా ఘటనలు జరుగుతున్నాయి’’ అని మనోజ్ పాండే అన్నారు. సైన్యంలో చేరాలనుకుంటున్న యువత తప్పుడు సమాచారానికి ప్రభావితం కాకుండా, ఫిజికల్ టెస్టు, రిటన్ టెస్ట్ ఎలా పాసవ్వాలి అనే అంశాలపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.