PM Modi: త్రివిధ దళాధిపతులతో రేపు మోదీ భేటీ

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై యువత, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేపు త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

PM Modi: త్రివిధ దళాధిపతులతో రేపు మోదీ భేటీ

Pm Modi

Updated On : June 20, 2022 / 8:05 PM IST

PM Modi: భారత త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం భేటీ కానున్నారు. మోదీ మంగళవారం ఉదయం కర్ణాటకలోని మైసూరులో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్తారు. అక్కడ త్రివిధ దళాధిపతులతో సమావేశమవుతారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై యువత, ప్రతిపక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రేపు త్రివిధ దళాధిపతులతో మోదీ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, మోదీ ముగ్గురితో ఒకేసారి భేటీ కావడం లేదు.

Narendra Modi: సంస్కరణలు కష్టంగానే ఉంటాయి కానీ..: మోదీ

వేరువేరుగా సమావేశమవుతారు. ముందుగా నేవీ చీఫ్ ఆర్.హరి కుమార్‌తో మోదీ సమావేశమవుతారు. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీం గురించి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఎంతగా నిరసనలు వ్యక్తమవుతున్ననప్పటికీ, మోదీ ప్రభుత్వం ‘అగ్నిపథ్’ విషయంలో వెనక్కు తగ్గే అవకాశం కనిపించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని కొనసాగించి తీరుతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.