Airtel New Prepaid Plans : ఎయిర్‌టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఎన్నో బెనిఫిట్స్.. రోజుకు డేటా ఎంతంటే?

Airtel New Prepaid Plans : దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది.

Airtel New Prepaid Plans : దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతి ఎయిర్‌టెల్ (Bharati Airtel) రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను లాంచ్ చేసింది. మరో టెలికం పోటీదారు రిలయన్స్ జియో ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్, ఫైబర్‌తో సహా తమ కస్టమర్లందరికీ ఇండిపెండెన్స్ డే ఆఫర్‌లను ప్రకటించింది. ఆ తర్వాత Airtel ఈ రెండు ప్లాన్‌లను లాంచ్ చేసింది. ఎయిర్ టెల్ అందించే ఈ రెండు కొత్త ఎయిర్‌టెల్ ప్లాన్‌ల ధర రూ. 519, మరొకటి రూ. 779గా వెల్లడించింది. రెండు ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1.5GB రోజువారీ హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMS, మరికొన్ని అదనపు డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ రెండు ప్లాన్‌లు ఇప్పటికే వెబ్‌సైట్, ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లో అందుబాటులో ఉంచింది. ఇప్పుడు.. కొత్తగా ప్రారంభించిన ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌లను ఓసారి లుక్కేయండి.

ఎయిర్‌టెల్ రూ.519 ప్లాన్ :
ఎయిర్‌టెల్ కొత్త రూ. 519 ఎయిర్‌టెల్ ప్లాన్‌లో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 1.5GB రోజువారీ డేటాతో 90GB డేటా, 60 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100 SMSలు పొందవచ్చు. అంతేకాదు.. టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ థాంక్స్ (Airtel Thanks) ద్వారా అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ఉచిత అపోలో 24|7 సర్కిల్, హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్, ఫాస్ట్‌ట్యాగ్‌లో రూ. 100 క్యాష్‌బ్యాక్ ఉన్నాయి. రోజువారీ డేటా ముగిసిన తర్వాత 64 Kbps స్పీడ్ ఇంటర్నెట్‌ పొందవచ్చు.

Airtel New Prepaid Plans

ఎయిర్‌టెల్ రూ.779 ప్లాన్ :
కొత్తగా ప్రారంభించిన ఎయిర్‌టెల్ రూ. 779 ప్రీపెయిడ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా బెనిఫిట్స్‌తో మొత్తం 135GB డేటాను అందిస్తుంది. ఇతర బెనిఫిట్స్ కోసం రూ. 519 ప్లాన్‌తో పొందవచ్చు. ఇందులో 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. అదనపు బెనిఫిట్స్‌తో పాటు రోజుకు 100SMS, Airtel Thanks బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. Airtel ప్లాన్ 1.5GB రోజువారీ డేటాను అందిస్తాయి. భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే రోజుకు 1.5GB డేటాతో ప్లాన్‌లను అందిస్తోంది.

రూ. 299 ప్లాన్ :
ఈ ప్లాన్ ద్వారా ఎయిర్‌టెల్ అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలు, 3 నెలల వ్యాలిడిటీతో అపోలో 24|7 సర్కిల్‌కు సబ్‌స్క్రిప్షన్ అదనపు బెనిఫిట్స్ పొందవచ్చు. Hellotunes, ఉచిత Wynk మ్యూజిక్, షా అకాడమీతో Upskill ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్సులతో సహా 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్‌పై 1 ఏడాది, రూ.100 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

రూ. 479 ప్లాన్ :
ఈ ప్లాన్ ద్వారా 56 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMSలు, అపోలో 24|7 సర్కిల్‌కి 3 నెలల వ్యాలిడిటీతో సబ్‌స్క్రిప్షన్, హెలోట్యూన్స్, ఉచిత వింక్ మ్యూజిక్, షాతో అప్‌స్కిల్ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోర్సులను కూడా అందిస్తుంది. ఫాస్ట్‌ట్యాగ్‌పై 1 ఏడాది పాటు అకాడమీ, రూ.100 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది.

Read Also : Airtel 5G Network Launch : ఈ నెలాఖరులో ఇండియాకు ఎయిర్‌టెల్ 5G సేవలు.. దేశంలోనే ఫస్ట్ టెలికం దిగ్గజం!

ట్రెండింగ్ వార్తలు