Airtel 5G Network Launch : ఈ నెలాఖరులో ఇండియాకు ఎయిర్‌టెల్ 5G సేవలు.. దేశంలోనే ఫస్ట్ టెలికం దిగ్గజం!

Airtel 5G Network Launch : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ఎట్టకేలకు ఆగస్టు చివరి నాటికి భారత్‌లో 5G నెట్‌వర్క్‌ (airtel 5g network launch in india)ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఆగస్టు 2022లో 5G నెట్‌వర్క్ విస్తర్ణలో భాగంగా భారత్‌లో 5G సేవలను ప్రారంభించిన మొదటి టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కానుంది.

Airtel 5G Network Launch : ఈ నెలాఖరులో ఇండియాకు ఎయిర్‌టెల్ 5G సేవలు.. దేశంలోనే ఫస్ట్ టెలికం దిగ్గజం!

Airtel 5G Network Launch _ Airtel to start rolling out 5G network in India in August, everything you need to know

Airtel 5G Network Launch : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ఎట్టకేలకు ఆగస్టు చివరి నాటికి భారత్‌లో 5G నెట్‌వర్క్‌ (Airtel 5G network launch in india)ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. టెలికాం దిగ్గజాల్లో Ericsson, Nokia, Samsung కంపెనీలతో పాటు 5G నెట్‌వర్క్ డీల్స్‌పై సంతకం చేసినట్టు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఆగస్టు 2022లో 5G నెట్‌వర్క్ విస్తర్ణలో భాగంగా భారత్‌లో 5G సేవలను ప్రారంభించిన మొదటి టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ కానుంది. ఇప్పటికే ఈ 5G సేవలకు సంబంధించి ఎరిక్సన్, నోకియాతో దీర్ఘకాల సంబంధాన్ని కలిగి ఉంది.

వీటికి తోడుగా సౌత్ కొరియన్ దిగ్గజం లేటెస్టుగా లిస్టులో చేరింది. టెలికాం శాఖ నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలంలో ఎయిర్‌టెల్ కూడా ఒక భాగమే. టెలికాం దిగ్గజం 900 MHz, 1800 MHz, 2100 MHz, 3300 MHz 26 GHz ఫ్రీక్వెన్సీలో 19867.8 MHZ స్పెక్ట్రమ్‌ను Airtel కొనుగోలు చేసింది. భారత్‌లో 5G సేవలు అమలుపై ఎయిర్‌టెల్ MD CEO గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. Airtel ఆగస్ట్‌లో (Airtel 5G Network Launch Date 2022)  5G సేవలను ప్రారంభిస్తుందని వెల్లడించారు. ఎయిర్ టెల్ నెట్‌వర్క్ ఒప్పందాలు ఇప్పటికే ఖరారు అయినట్టు ఆయన తెలిపారు.

Airtel 5G Network Launch _ Airtel to start rolling out 5G network in India in August, everything you need to know

Airtel to start rolling out 5G network in India in August, everything you need to know

ఎయిర్ టెల్ వినియోగదారులకు 5G కనెక్టివిటీ పూర్తి ప్రయోజనాలను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్టు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ సాంకేతిక భాగస్వాములతో Airtel పని చేస్తుంది. భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా మారడంలో టెలికాం దిగ్గజం కీలకంగా మారింది. అంతేకాదు.. పరిశ్రమలు, సంస్థలు సైతం భారత సామాజిక-ఆర్థిక అభివృద్ధి డిజిటల్ 5G గేమింగ్ అవకాశాన్ని అందించనుంది. భారత్‌లో 5G నెట్‌వర్క్‌ని పరీక్షించిన మూడు టెలికాం కంపెనీలలో ఎయిర్‌టెల్ మొదటిదిగా చెప్పవచ్చు.

టెలికాం కంపెనీ అనేక ప్రాంతాల్లో మల్టీ పార్టనర్లతో అనేక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్ (5G network in India in August) పరీక్షించింది. హైదరాబాద్‌లో లైవ్ 4G నెట్‌వర్క్ ద్వారా భారత్ మొదటి 5G అనుభవాన్ని కూడా అందించింది. ఎయిర్‌టెల్ భారత మొట్టమొదటి గ్రామీణ 5G ట్రయల్‌ను కూడా నిర్వహించింది ట్రయల్ స్పెక్ట్రమ్‌లో భారత్ మొట్టమొదటి క్యాప్టివ్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ని విజయవంతంగా అమలు చేసేందుకు 5Gలో మొదటి క్లౌడ్ గేమింగ్ అనుభవాన్ని కూడా పరీక్షించింది. అందులో రిలయన్స్ జియో (Reliance Jio) 5G స్పెక్ట్రమ్‌లో అతిపెద్ద బిడ్డర్‌గా అవతరించింది.

Read Also : Airtel 5G Network Trial : జియోకు పోటీగా ఎయిర్‌టెల్ 5G.. టెస్టింగ్‌లోనే 1Gbps స్పీడ్ దాటేసింది..