Akasa Air's First Flight
Akasa Air’s First Flight: ఆకాశ ఎయిర్ మొట్టమొదటి కమర్షియల్ విమాన సేవలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఆకాశ ఎయిర్ ప్రముఖ మదుపరి (ఇన్వెస్టర్) రాకేశ్ ఝున్‌ఝున్ వాలాకు చెందినదన్న విషయం తెలిసిందే. మొదటి కమర్షియల్ విమానం బోయింగ్ 737 మ్యాక్స్ ప్రయాణికులతో ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్ళింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో పాటు కేంద్ర సహాయ మంత్రి విజయ్ కుమార్ సింగ్ చేతుల మీదుగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి.
ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర పౌర విమానయాన శాఖ తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య సర్వీసులు అందించే ఆకాశ ఎయిర్‌కు చెందిన విమానాలకు సంబంధించిన టికెట్ల బుకింగ్‌లను కొన్ని రోజుల క్రితమే ప్రారంభించారు. ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య విమాన సేవలు ప్రారంభం అవుతాయి. వీటి బుకింగులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. www.akasaair.com వెబ్‌సైట్ లేదా ఆకాశ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఆకాశ ఎయిర్ సంస్థ గత ఏడాది బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. కమర్షియల్ సేవలకు ఆ సంస్థ ఇటీవల పెద్ద ఎత్తున సిబ్బందిని నియమించుకుంది. దశల వారీగా విమాన సర్వీసులను విస్తరించుకుంటూ పోనుంది. కొన్ని నెలల్లో దేశంలోని మరిన్ని నగరాల మధ్య ఆకాశ ఎయిర్ సేవలు అందనున్నాయి.
Presenting a new airline to India ?? @AkasaAir
Live inauguration: https://t.co/dv8pWJ24pT
— Jyotiraditya M. Scindia (@JM_Scindia) August 7, 2022