India invites US singer Millben: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రసిద్ధ అమెరికన్‌ గాయని మేరీ మిల్‌బెన్‌

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికా తరఫున అధికారిక ప్రతినిధిగా ఆఫ్రికా సంతతికి చెందిన ప్రసిద్ధ అమెరికన్‌ గాయని మేరీ మిల్‌బెన్‌ రానున్నారు. ‘ఓం జయ్‌ జగదీశ హరే’తో పాటు ‘జనగణమన’ గీతాలు పాడిన ఆమె భారతీయులకు ఆమె సుపరిచితురాలే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రావాలని కోరింది.

India invites US singer Millben: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రసిద్ధ అమెరికన్‌ గాయని మేరీ మిల్‌బెన్‌

India invites US singer Millben:

India invites US singer Millben: భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అమెరికా తరఫున అధికారిక ప్రతినిధిగా ఆఫ్రికా సంతతికి చెందిన ప్రసిద్ధ అమెరికన్‌ గాయని మేరీ మిల్‌బెన్‌ రానున్నారు. ‘ఓం జయ్‌ జగదీశ హరే’తో పాటు ‘జనగణమన’ గీతాలు పాడిన ఆమె భారతీయులకు సుపరిచితురాలే. భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గతంలో పలుసార్లు ఆమె గీతాలు పాడి వీడియోలు పోస్ట్ చేశారు. దీంతో ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది. భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రావాలని కోరింది.

ఢిల్లీలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో మేరీ మిల్‌బెన్‌ పాల్గొంటారు. అంతకు ముందు ఓ ప్రదర్శన ఇస్తారని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు సాంస్కృతిక సంబంధాల సమాఖ్య ఓ ప్రకటనలో వివరాలు పేర్కొంది. అమెరికా కళాకారులను భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం ఇదే మొట్టమొదటిసారి. భారత్ నుంచి తనకు ఆహ్వానం అందడం పట్ల మిల్‌బెన్‌ ట్విటర్ వేదికగా స్పందించారు. అమెరికా నుంచి కల్చరల్ అంబాసిడర్ గా భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వెళ్తుండడం గర్వంగా ఉందని ఆమె చెప్పారు.

భారత్‌, అమెరికాల మధ్య సత్సంబంధాలకు ప్రతీకగా నిలుస్తోన్న మేరీ మిల్బెన్‌ ఈ నెల 10న ఇండియాస్పోరా గ్లోబల్‌ ఫోరమ్‌లో మేరీ భారత జాతీయ గీతాన్ని పాడతారు. ఇందులో తమిళనాడుకు చెందిన పియానో కళాకారుడు లిడియన్‌ కూడా పాల్గొంటారు. కాగా, భారత దేశ సంస్కృతి అంటే తనకు చాలా ఇష్టమని మేరీ మిల్‌బెన్‌ గతంలో పలు సార్లు చెప్పారు. తాను హిందీని అధ్యయనం చేయడం ద్వారా భారత్ పై అభిమానాన్ని పెంచుకున్నానని అన్నారు.

Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం