Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింద‌ని విశాఖ‌ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఒడిశా తీరానికి సమీపంలో అది కొనసాగుతోంద‌ని వివ‌రించింది. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది. కోస్తా, ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు మళ్ళీ వరద ముప్పు పొంచి ఉంది.

Weather update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం

Weather update: తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్ళీ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింద‌ని విశాఖ‌ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. ఒడిశా తీరానికి సమీపంలో అది కొనసాగుతోంద‌ని వివ‌రించింది. దీని ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయ‌ని చెప్పింది. కోస్తా, ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు మళ్ళీ వరద ముప్పు పొంచి ఉంది.

ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, యానాం ప్రాంతాల్లో వర్షాలు ప‌డే అవ‌కాశం ఉంది. అలాగే, 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయ‌ని విశాఖ‌ వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక చేసింది. కాగా, ఇటీవ‌లే గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ఎన్న‌డూ లేనంత ప్రవాహం వ‌చ్చి, పరీవాహక ప్రాంతాలు నీట మునిగిన విష‌యం తెలిసిందే.

కాళేశ్వరం పంపు హౌస్‌లు, కంట్రోల్ రూములు కూడా నీట మునిగిపోయాయి. భద్రాచలం వద్ద నది ఉద్ధృతంగా మారింది. ఇప్పుడు గోదావరి నదీ పరివాహక ప్రాంతాలకు మళ్ళీ వరద ముప్పు మళ్ళీ పొంచి ఉంది.

Edible oils to get cheaper: దేశంలో త‌గ్గ‌నున్న వంట నూనెల ధ‌ర‌లు.. ఎంతంటే..?