Edible oils to get cheaper: దేశంలో త‌గ్గ‌నున్న వంట నూనెల ధ‌ర‌లు.. ఎంతంటే..?

దేశంలో వంట నూనెల ధరలు లీటరుపై దాదాపు రూ.10 నుంచి రూ.12 మ‌ధ్య తగ్గే అవ‌కాశం ఉంది. ఇందుకు అంతర్జాతీయంగా ధరలు తగ్గడ‌మే కార‌ణం. ఇటీవ‌ల వంట నూనెల తయారీ సంస్థలతో కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపింది. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గ‌డంతో దేశంలోనూ త‌గ్గించాల‌ని త‌యారీ సంస్థ‌ల‌కు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించ‌డంతో అందుకు ఆయా సంస్థ‌లు అంగీక‌రించాయి.

Edible oils to get cheaper: దేశంలో త‌గ్గ‌నున్న వంట నూనెల ధ‌ర‌లు.. ఎంతంటే..?

Edible oils to get cheaper

Edible oils to get cheaper: దేశంలో వంట నూనెల ధరలు లీటరుపై దాదాపు రూ.10 నుంచి రూ.12 మ‌ధ్య తగ్గే అవ‌కాశం ఉంది. ఇందుకు అంతర్జాతీయంగా ధరలు తగ్గడ‌మే కార‌ణం. ఇటీవ‌ల వంట నూనెల తయారీ సంస్థలతో కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు జ‌రిపింది. అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు త‌గ్గ‌డంతో దేశంలోనూ త‌గ్గించాల‌ని త‌యారీ సంస్థ‌ల‌కు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సూచించ‌డంతో అందుకు ఆయా సంస్థ‌లు అంగీక‌రించాయి.

వంట నూనెల ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని తయారీ సంస్థల ప్రతినిధులు చెప్పారు. ఇటీవల ప‌లు సంస్థ‌లు వంట నూనెల ధ‌ర‌ల‌ను త‌గ్గించాయి. అదానీ విల్మర్ సంస్థ‌ వంట నూనె ధ‌ర‌ను లీటరుకు రూ.30 వరకు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. సోయా నూనెల ధరలను అధికంగా తగ్గించింది. అంత‌ర్జాతీయ ప‌రిస్థితులు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం నేపథ్యంలో కొంత కాలంగా వంట నూనె ధరలు పెరిగిపోతూ వ‌చ్చాయి. లీటరు వంట‌ నూనె ధర రూ.200 క‌న్నా అధికంగా ఉంది.

దీంతో కేంద్ర ప్ర‌భుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించి ప‌లు చ‌ర్య‌లు తీసుకుంది. ఇప్పుడు రేట్లు త‌గ్గించాల‌ని తయారీదారులు సానుకూలంగా నిర్ణ‌యం తీసుకోవ‌డంలో ఇత‌ర సంస్థ‌ల వంట నూనె ధ‌ర‌లూ త‌గ్గ‌నున్నాయి. దేశంలో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెరిగిపోతోన్న నేప‌థ్యంలో వంట నూనెల త‌గ్గుద‌ల అంశం సామాన్యుడికి కాస్త‌యినా ఊర‌ట క‌లిగించ‌నుంది.

India asks China: రెచ్చగొట్టే చర్యలు ఆపండి.. చైనాకు తేల్చిచెప్పిన భారత్