UP : బీజేపీ జన విశ్వాస్ యాత్ర కాదు..యూపీ అంతా క్షమాపణ యాత్ర చేయాలి : అఖిలేష్ యాదవ్

UPతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో బీజేపీ నిర్వహించే జనవిశ్వాస్ యాత్రపై అఖిలేష్ యాదవ్ ‘బీజేపీ జనవిశ్వాస్ యాత్రకాదు..యూపీ అంతా క్ష్జమాపణ యాత్ర’ చేయాలని డిమాండ్

  • Updated on- January 8, 2022 / 01:05 PM IST

5stateselections..with Uup

5StatesElections..with Up : యూపీతో పాటు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈక్రమంలో యూపీలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి..సెటైర్లు..కౌంటర్లు ఇలా హాట్ హాట్ గా సభలు,సమావేశాలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బీజేపీపై సెటైర్లు వేస్తున్నారు..వరుస సభలు, ర్యాలీలలో బిజీ బిజీగా ఉన్న అఖిలేశ్ రెండురోజుల విరామం తరువాత మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు.

Read : Akhilesh yadav: ప్రతీరాత్రి శ్రీ కృష్ణుడు నా కలలోకి వస్తాడు..రామరాజ్యం నెలకొల్పుతానని చెబుతాడు : అఖిలేశ్‌ యాదవ్‌

బీజేపీ నిర్వహించే ‘జన విశ్వాస్’ యాత్రపై సెటైర్లు వేశారు. బీజేపీ నిర్వహించే యాత్ర పేరు మార్చుకోవాలని అది ‘జన విశ్వాస్ యాత్ర’ కాదు..దాని పేరు కాదు ‘జన మాఫీ యాత్ర’అని మార్చుకోవాలని అన్నారు అఖిలేష్ యాదవ్. బీజేపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని..యూపీ ప్రజలందరికి క్షమాపణలు చెబుతు యాత్ర చేపట్టాలని గోండాలో నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. యూపీ ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని..ప్రజలు బీజేపీని ఎప్పటికి క్షమించరని అన్నారు.

Read : Yogi Retorts To Akhilesh : అఖిలేష్ “రామ రాజ్యం”వ్యాఖ్యలకు యోగి కౌంటర్

ఓవైపు బీజేపీని విమర్శిస్తునే మరోవైపు సీఎం యోగీ అదిత్యానాథ్ పోటీ చేసే సీటుపై అఖిలేశ్ ఘాటు విమర్శలు చేశారు. ఎక్కడనుచంచి పోటీ చేస్తారోయోగీకే తెలియదని..ఆయన సొంత నిర్ణయం తీసుకోలేరని..ఒకసారి ఓ సీటునుంచిపోటీ చేస్తానని చెబుతారని..మరోసారి మరొకటి ఇలా చెబుతుంటారని యోగీపై విమర్శలు చేశారు అఖిలేశ్.