Alia Bhatt and Ranbir Kapoor Daughter name goes viral
Alia-Ranbir : బాలీవుడ్ స్టార్ కపుల్ అలియాభట్, రణబీర్ కపూర్ కొన్నేళ్లు ప్రేమించుకొని ఈ సంవత్సరం ఏప్రిల్ లో పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని ఆస్వాదిస్తున్నారు. అలియా ఇటీవలే నవంబర్ 6న ఒక పాపకి జన్మనిచ్చింది. ఇప్పటివరకు వారి పాపని అయితే చూపించలేదు. తాజాగా వారి పాపకి పేరు పెట్టామని అలియా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Allari naresh : పవన్ కళ్యాణ్ పార్టీపై, రాజకీయాలపై స్పందించిన నరేష్..
అలియా, రణబీర్, పాప ఉన్న ఫోటోని షేర్ చేసి.. ”తనకి రాహా అని పేరు పెట్టాము. వాళ్ళ డాడీనే ఈ పేరు సూచించాడు. ఈ పేరుకు అనేక అర్దాలు ఉన్నాయి. రాహా అంటే అసలైన అర్ధం దైవ మార్గం, అలాగే స్వాహిలి భాషలో ఆనందం, సంస్కృతంలో వంశం, బెంగాలీలో విశ్రాంతి, సౌకర్యం, అరబిక్‌లో శాంతి అనే అర్దాలు వస్తాయి. అలాగే సంతోషం, స్వేచ్ఛ అనే అర్దాలు కూడా వస్తాయి. ఈ పేరు నిజంగా తనకి సరిపోతుంది, రాహా రాకతో మా జీవితంలో మరింత కాంతి వచ్చి కొత్త జీవితం ప్రారంభించాము” అని తెలిపింది. దీంతో అలియా భట్ కూతురి పేరు రాహా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.